నాగ చైతన్యని పక్కన పెట్టి వేరే కుర్రాడితో చక్కర్లు కొడుతున్న శోభిత.. ఏంటి సంగతి..!

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడ. దాదాపు నాలుగేళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏవో కారణాల విడాకులు తీసుకోవల్సి వచ్చింది. 2021 అక్టోబర్ నెలలో అధికారికంగా తామిద్దరం విడిపోతున్నట్లు తెలియజేశారు.ఎంతో అన్యోన్యంగా ఉండే వీరు ఎందుకు విడిపోయారు, అసలు విడిపోవల్సిన పరిస్థితులు ఏంటని ఇప్పటికీ చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే సమంత నుండి విడిపోయిన తర్వాత చై… శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారాలు జరిగాయి. శోభితని కొత్తగా నిర్మించుకున్న ఇంటికి తరచు తీసుకొస్తున్నాడని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై నాగ చైతన్య టీమ్ స్పందిస్తూ అవన్నీ అవాస్తవాలు అని కొట్టి పారేసారు.
ఓ సందర్భంలో శోభిత, నాగ చైతన్య విదేశాల్లో కలిసినట్లు ఒక ఫోటో నెట్టింట తెగ హల్‌చల్ చేసింది. శోభిత, చై పక్క పక్కన నిలుచొని ఫొటోలకి పోజులిచ్చినట్టు ఉండగా, అది మార్ఫింగ్ ఫొటో అని అభిమానులు తెలుసుకున్నారు. కాని ఓ సారి ఈ జంట లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ ని సందర్శించారు. అందులో పని చేసే చెఫ్ నాగ చైతన్యతో ఫోటో దిగాడు. అది తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. అయితే ఆ ఫొటోలో శోభిత ధూళిపాళ్ల కూడా కనిపించడంతో చై- శోభిత మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని అందరు అవగాహనకి వచ్చారు. మరి కొద్ది సేపటికే సదరు చెఫ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫోటో డిలీట్ చేయడం విశేషం.
నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల త్వరలో పెళ్లి చేసుకుంటారని గత కొద్ది రోజులుగా ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో రీసెంట్‌గా ఈ భామ ముంబైలో రెస్టారెంట్ నుండి యువకుడితో బయటకు వచ్చింది. ఆ సమయంలో మీడియా ఆమెని చుట్టుముట్టగా, ఈ భామ మాత్రం అక్కడి నుండి స్పీడ్‌గా వెళ్లింది. ఆ యువకుడు మరో కారులో జారుకున్నాడు. మరి శోభితతో కనిపించిన ఆ యువకుడు ఎవరు, వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనే దానిపై నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు.