శ్రీముఖిని కోప‌రేట్ చేస్తావా అని అడిగిన అవినాష్‌.. అంద‌రి ముందు గోడు వెళ్ల‌బోసుకున్న యాంక‌ర‌మ్మ‌

శ్రీముఖిని కోప‌రేట్ చేస్తావా అని అడిగిన అవినాష్‌.. అంద‌రి ముందు గోడు వెళ్ల‌బోసుకున్న యాంక‌ర‌మ్మ‌

అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఎక్క‌డ చూసిన కూడా శ్రీముఖి హ‌వానే కనిపిస్తుంది. అన్ని ఛానెల్స్‌లో కూడా శ్రీముఖి త‌న‌దైన హ‌వా చూపిస్తుండ‌గా, ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం కొత్త షో చేస్తుంది. అయితే ఈషోలో అవినాష్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది శ్రీముఖి. వీరిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉండ‌గా, ఒక‌రినొక‌రు స‌పోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ ఇద్ద‌రు కలిసి `ఆదివారం స్టార్‌ మా పరివార్‌` షో చేస్తుండా, ఇందులో సోద‌రి సోద‌రీమ‌ణుల్లా క‌లిసి పోతూ తెగ జోకులు వేసుకుంటూ సందడి చేస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో కూడా అవినాష్‌, శ్రీముఖి సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. అవినాష్ .. శ్రీముఖిపై ఎలాంటి జోకులు వేసిన కూడా అది స్పోర్టివ్‌గా తీసుకుంటుంది. అయితే తాజాగా శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముక్కు అవినాష్‌పై శ్రీముఖి సంచలన ఆరోపణలు చేస్తూ.. తనని `ఇది కార్పోరేట్‌ షోకాదు.. కోపరేట్‌ చేస్తావా` అని అడిగినట్టు స్టార్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడికి తెలియ‌జేసింది. అవినాష్ త‌న‌ని ఇలా అన్నాడ‌ని త‌న గోడు వెళ్ల‌బుచ్చ‌కుంది శ్రీముఖి. షోలో అంద‌రి ముందు శ్రీముఖి ఇలాంటి కామెంట్స్ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే శ్రీముఖి కామెంట్స్‌పై స్పందించిన అవినాష్‌.. తనకే పాపం తెలియదని అంటాడని భావించారు. కానీ అలా అనలేదు. అమ్మతోడు సార్‌ చెబుతున్నా, తాను అలానే అన్నట్టు ఒప్పుకోవడం విశేషం. ఓ షోలో భాగంగా జ‌రిగిన డిస్క‌ష‌న్ ఇది కాగా, ప్రోమోలో ఈ విష‌యాల‌ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అనిల్‌ రావిపూడి జడ్జ్ గా `ఆహా`లో కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్‌` రాబోతుండ‌గా, ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో శ్రీముఖి.. అవినాష్‌పై ఆరోపణలు చేయ‌డం, ఆ త‌ర్వాత అవినాష్‌ విభిన్న రకాలుగా కామెడీ చేసి నవ్వులు పూయించ‌డంతో ప్రోమో ట్రెండింగ్‌లో ఉంది. గ‌తంలో ఈ షోకి సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి యాంకర్లుగా వ్య‌వ‌హ‌రించ‌గా, ఈ సీజ‌న్‌కి శ్రీముఖి హోస్ట్‌గా ఉంది.