ప్ర‌తి ఇంటికి కండోములు పంచిన సునీత కొడుకు..భార్య అస‌హ్యించుకున్నా చిరు ప్ర‌శంస‌లు

  • By: sn    breaking    Dec 21, 2023 11:25 AM IST
ప్ర‌తి ఇంటికి కండోములు పంచిన సునీత కొడుకు..భార్య అస‌హ్యించుకున్నా చిరు ప్ర‌శంస‌లు

టాలీవుడ్‌కి కొత్త స్టార్స్ ప‌రిచయం అవుతున్నారు. ఇప్ప‌టికే సుమ కొడుకు బ‌బుల్ గ‌మ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ధం కాగా, సింగ‌ర్ సునీత త‌న‌యుడు త్వ‌ర‌లో స‌ర్కారు నౌక‌రి చిత్రంతో అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు.సునీత కొడుకు తొలి సినిమాతోనే పెద్ద సాహ‌సం చేస్తున్నారు. ప‌ల్లెటూరులో ప్ర‌తి ఇంటికి కండోములు పంచుతూ ఉద్యోగం చేసాడు. అయితే అలా కండోములు పంచ‌డం వ‌ల‌న అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అత‌ని భార్య కూడా అత‌డిని అస‌హ్యించుకుంటుంది. అయితే ఆ త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి అనేది సర్కారు నౌకరి చిత్ర కథ. ఇందులో భావన హీరోయిన్‌గా న‌టించ‌గా, గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహించాడు.

ఆర్కే టెలీ షో బ్యానర్‌పై కె రాఘవేంద్రరావు ఈ మూవీని నిర్మించ‌గా, రీసెంట్‌గా చిత్ర‌ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. దీనికి నిర్మాత కె రాఘవేంద్రరావుతోపాటు ప్రముఖ దర్శకులు అనిల్‌ రావిపూడి, శేఖర్‌ కమ్ముల ఆవిష్కరించారు. ట్రైలర్‌ చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా వారిని అభినందించారు. తెలంగాణ నేపథ్యంలో స్వచ్ఛమైన పల్లెటూరి కథతో ఈ చిత్రం రూపొందిందని, క‌థ ఫ్రెష్‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఆకాష్‌ పర్ ఫార్మెన్స్ చూసిన తర్వాత మరే హీరో ఈ కథకు న్యాయం చేయలేడు అనిపించింది అని రాఘ‌వేంద్ర‌రావు అన్నారు.

సింగర్ సునీత మాట్లాడుతూ, నాకు ఒక జీవితానికి సరిపడా సంతృప్తినిచ్చిన సినిమా ఇది అని పేర్కొంది. కెరీర్ లో మొదటి సినిమా అంటే ఎవరికైనా ప్రత్యకంగా ఉంటుంది. మా అబ్బాయి అలాంటి స్పెషల్ మూవీ చేయ‌డం, ఈ సినిమాని అబ్బాయికి అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి, దర్శకుడు శేఖర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం అని అన్నారు.. మా సినిమాకు సపోర్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మీడియా సమక్షంలో థ్యాంక్స్ చెబుతున్నా అని పేర్కొంది సునీత‌. చిత్రంలో ఆకాశ్ గ్రామాల్లో హెల్త్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తాడు. సెక్స్ పరమైన రక్షణ కోసం ఆయన ఇంటింటికి కండోములు పంచుతుంటుండ‌గా, వాటిని పిల్లలు బుగ్గలుగా ఊదుకుంటూ ఆడుకుంటారు. వాటి గురించి తెలుసుకున్నాక ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి, చివ‌రికి ఆకాశ్ జీవితం ఎలా మారింది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.