సత్యం దర్శకుడు కన్నుమూత..ఆ పొరపాటే ముంచేసిందా?

అప్పటి హీరోయిన్ కళ్యాణి భర్త, బిగ్ బాస్ కంటెస్టెంట్, దర్శకుడు సూర్య కిరణ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూసారు. ‘సత్యం’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు గడించిన సూర్య కిరణ్ కంటికి పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సూర్య మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సూర్య కిరణ్ బిగ్ బాస్ తెలుగు నాల్గో సీజన్‌లోనూ పాల్గొని సందడి చేశారు. అంతేకాదు బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన కళ్యాణితో విడాకుల గురించి కూడా అనేక కామెంట్స్ చేశారు.
బాల నటుడిగా సౌత్‌లో 200పైగా చిత్రాల్లో నటించిన సూర్య కిరణ్.. ‘సత్యం’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించాడు.ఈ సినిమా తర్వాత ధన, బ్రహ్మస్త్రం, రాజూ భాయ్ వంటి సినిమాలు తీసినా సక్సెస్ దక్కలేదు. నటి కళ్యాణిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న సూర్య కిరణ్ ఆమెతో వచ్చిన పలు విబేధాల వలన విడాకులు తీసుకున్నాడు. కళ్యాణి తన అమ్మ తరువాత అమ్మ అని చెప్పుకొచ్చిన సూర్య కిరణ్ రోజూ ఆమెని మిస్ అవుతానని ఓ సందర్భంలో తెలియజేశారు. నేను తనకి అవసరం లేకపోయిన ఆమె అంటే ఇష్టం, ప్రేమ రెండు ఉన్నాయని, ఆమె లోటుని ఎవరు భర్తీ చేయలేరని పేర్కొన్నాడు సూర్య కిరణ్.
ఈ జన్మకే కాదు.. ఇంకెన్ని జన్మలెత్తినా కూడా.. నా భార్య స్థానం కళ్యాణిదే అంటూ ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె గురించి చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. కేరళాకి చెందిన సూర్య కిరణ్ మలయాళ సినిమాలతో కెరీర్‌ని ప్రారంభించగా, ఆయన 1978లో `స్నేహిక్కన్ ఓరు పెన్ను` అనే చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళంతోపాటు కన్నడ, తమిళంలో పలు సినిమాలు చేశారు. 1986లో చిరంజీవి హీరోగా నటించిన `రాక్షసుడు` మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. `దొంగమొగుడు`, `సంకీర్తన`, `ఖైదీ నెం 786`, `కొండవీటి దొంగ` చిత్రాల్లో కీలక పాత్రల్లో కూడా నటుడిగా మెప్పించాడు.చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ వంటి బిగ్ స్టార్స్ తో సినిమాలు చేసి మెప్పించిన ఆయన సత్యం చిత్రంతో దర్శకుడిగా మారాడు. సూర్య కిరణ్ మృతితో సినీ ప్రియులు శోక సంద్రంలో మునిగిపోయారు