Kalki AD2898 | ప్రభాస్‌ ‘కల్కి AD2898’ మూవీపై భారీగా అంచనాలు పెంచేసిన స్వప్నదత్‌..!

Kalki AD2898 | ప్రభాస్‌ ‘కల్కి AD2898’ మూవీపై భారీగా అంచనాలు పెంచేసిన స్వప్నదత్‌..!

Kalki AD2898 | యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవల సలార్‌ సినిమాతో అభిమానులను పలకరించాడు. ప్రస్తుతం ‘మహానటి’ ఫేమ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి’. అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా మూవీ తెరకెక్కుతున్నది. చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తున్నది. అలాగే మరో బ్యూటీ దిశా పటానీ సైతం మరో కీలక పాత్ర పోషిస్తున్నది.

మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ మూవీ మే 9న ‘కల్కి 2898ఏడీ’ చిత్రం రాబోతున్నది. దాదాపు రూ.600కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా.. చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌ భారీ అంచనాలు పెంచాయి. హాలీవుడ్‌ స్థాయిలో ఉందని అభిమానులు పేర్కొంటున్నారు.

తాజాగా అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ వ్యాఖ్యలు సైతం సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ వేడుక వైభవంగా జరిగింది. ఇందులో పాల్గొన్న స్వప్న దత్‌ మాట్లాడుతూ.. ప్రభాస్ పోషిస్తున్న ‘భైరవ’ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందన్నారు. ఈ చిత్రం సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం మే 7న రిలీజ్‌ వుతుందా ? అనేదా? అనుమానాలుండగా.. రైట్‌ట్రాక్‌లో సిద్ధం అవువుతోందని స్వప్నదత్‌ క్లారిటీ ఇచ్చింది.