ఏంటి.. తాప్సీ అత‌డిని సైలెంట్‌గా పెళ్లి చేసుకుందా..విష‌యం ఎలా బ‌య‌ట‌కి వ‌చ్చిందంటే..!

ఏంటి.. తాప్సీ అత‌డిని సైలెంట్‌గా పెళ్లి చేసుకుందా..విష‌యం ఎలా బ‌య‌ట‌కి వ‌చ్చిందంటే..!

ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి ఆ త‌ర్వాత టాలీవుడ్ హీరోల‌తో కొన్ని సినిమాలు చేసిన తాప్సీ ఆ త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్లింది. అక్క‌డ ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా తాప్సీకి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కాయి.ఈ అమ్మ‌డు గ‌త‌ పదేళ్లుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ తో ప్రేమలో ఉందని ప్ర‌చ‌రాలు జ‌రుగుతున్నా కూడా ఏ నాడు స్పందించింది లేదు. 2013లో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో మొదటిసారిగా తాప్సీ, మథియాస్ కల‌వగా ఆ స‌మ‌యంలోనే వారిద్ద‌రు ప్రేమలోపడ్డారు. అప్పటినుండి వీరు ఈ హ్యాపీ రిలేషన్‌షిప్‌ను కొన‌సాగిస్తుండ‌గా, వారి రిలేష‌న్ గురించి మీడియా ఎన్ని ప్ర‌శ్న‌లు వేసిన దానికి ఘాటుగా స్పందిస్తూ వెళ్లిపోయేది.

అయితే తాప్సీ సైలెంట్‌గా పెళ్లి పీట‌లెక్కిన‌ట్టు స‌మాచారం. మూడు రోజుల క్రితం మథియాస్ బోయ్‌తో తాప్సీ వివాహం ఉదయ్ పూర్ లోని ఓ హోటల్ లో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే జ‌రిగింద‌ని అంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ అయితే లేదు. పెళ్లి వేడుకలు మొదలయ్యే కొన్నిరోజుల ముందే తాప్సీ చివరిసారిగా ఫోటోగ్రాఫర్ల ముందుకు రాగా, ఆ త‌ర్వాత ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్స్ అయిన గౌరీ, నైనికా షోలో షో స్టాపర్‌గా కనిపించింది. ఇక పెళ్లి వేడుకల కోసం ఉదయ్‌పూర్ వెళ్లిపోయినట్టు సమాచారం. తాప్సీ కి క్లోజ్ అయిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు కనికా థిల్లాన్, పావైల్ గులాటి, అనురాగ్ కశ్యప్.. పలువురు ఈ పెళ్ళికి హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.

మ‌రి ప్ర‌స్తుతం తాప్సీ పెళ్లి జ‌రిగిన‌ట్టు సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారాలు న‌డుస్తుండగా, ఇందులో నిజం ఎంత ఉంద‌నేది తెలియ‌దు. ఇక తాప్సీ పెళ్లి చేసుకున్న మథియాస్ బో విష‌యానికి వ‌స్తే అత‌ను ఒక మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్. తను ప్లేయర్‌గా రాణిస్తున్న సమయంలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. తను ఒలింపిక్స్‌లో మెడల్ సాధించ‌డ‌మే కాకుంఆ ప్రపంచ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్ బ్యాడ్మింటన్ నేషనల్ టీమ్‌కు కోచ్‌గా పనిచేస్తున్నాడు.వారిద్ద‌రు గ‌త కొద్ది రోజులుగా డేటింగ్‌లో ఉండ‌గా, ఇన్నాళ్ల‌కి వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు.