తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం: వైద్యులు
విధాత: కుప్పంలో నిన్న ఉదయం ప్రారంభమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి హీరో తారకరత్న పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఆయన్ను అత్యంత కీలకమైన ఎక్మో ట్రీట్మెంట్ పరిధిలో ఉంచారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కాసేపటి క్రితం నారాయణ ఆస్పత్రి వైద్యులు తారకరత్నకు సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తారక రత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అయినా తమ ప్రయత్నం తాము చేస్తున్నామని వివరించారు. ఇదిలా […]

విధాత: కుప్పంలో నిన్న ఉదయం ప్రారంభమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి హీరో తారకరత్న పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఆయన్ను అత్యంత కీలకమైన ఎక్మో ట్రీట్మెంట్ పరిధిలో ఉంచారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కాసేపటి క్రితం నారాయణ ఆస్పత్రి వైద్యులు తారకరత్నకు సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తారక రత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అయినా తమ ప్రయత్నం తాము చేస్తున్నామని వివరించారు. ఇదిలా ఉండగా నందమూరి కుటుంబీకులు ఇప్పటికే బెంగళూరు చేరుకుని పరిస్థితిని గమనిస్తున్నారు
గుండె నాళ్లాలోకి రక్త ప్రసరణ జరగడం లేదని, ఎక్మో ద్వారా కృతిమ శ్వాస అందజేస్తున్నామని, దీని ద్వారా 50 నుంచి 55 శాతం వరకు కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆయనకు ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. పరిస్థితి విషమమే గానీ హోప్‌లెస్ కాదని తెలిపారు. బాలకృష్ణ బెంగళూరులోనే ఉండి వైద్యులతో మాట్లాడుతుండగా ఈ రోజు సాయంత్రాానికి చంద్రబాబు బెంగళూరు వెళ్లనున్నారు.
లోకేశ్‌కు మద్దతుగా పాద యాత్రలో పాల్గొన్న తారకరత్న నిన్న సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే తారకరత్నను ఆస్పత్రికి తరలించగా.. తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ అని గుర్తించి వైద్యులు మొదట సీపీఆర్ చేశారు. కార్డియాలజిస్ట్ గుండెపోటు అని తేల్చడంతో కుప్పం మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందించారు.
ఇక కుప్పంలో చికిత్స చేసినా పెద్దగా ప్రయోజనం కలుగక పోవడంతో క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో తరలించి నారాయణ హృదయాలలో క్రిటికల్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చారు. తారకరత్న రక్తనాళాళ్లో 95 శాతం బ్లాక్స్ ఉండడంతో గుండె దాదాపు పనిచేయడం లేదని తెలుస్తోంది. ఎక్మో అమర్చడం వల్ల ఆర్టిఫిషియల్ గా శరీర భాగాలకు రక్తం ఆక్సిజన్ అందుతోంది.