కోట్లు సంపాదిస్తున్న అల్లు అర్జున్ ఆ వంద రూపాయాలని జాగ్రత్త‌గా దాచుకున్నాడ‌ట‌..!

కోట్లు సంపాదిస్తున్న అల్లు అర్జున్ ఆ వంద రూపాయాలని జాగ్రత్త‌గా దాచుకున్నాడ‌ట‌..!

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారాడు. ఆయ‌న‌కి గ్లోబ‌ల్ ఇమేజ్ ద‌క్కింది. ఇప్పుడు బ‌న్నీ సినిమాల కోసం దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో ఉన్నబన్నీకి.. ఇప్పుడు ఉన్న బన్నీకి మధ్య చాలా వ్య‌త్యాసం ఉంది. అప్ప‌ట్లో ఎవ‌రైతే ఆయ‌న‌ని విమ‌ర్శించారో వారే ఇప్పుడు అల్లు అర్జున్‌ని ఆకాశానికి ఎత్తుతున్నారు. పుష్ప చిత్రానికి గాను బ‌న్నీ నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకొని స‌త్తా చాటాడు. ఇప్పటి వరకూ బెస్ట్ హీరో క్యాటగిరీలో టాలీవుడ్ కి జాతీయ అవార్డ్ రాలేదు. కాని అల్లు అర్జున్ పుష్ప సినిమాతో చెక్ పెట్టాడు.

బ‌న్నీ ఇప్పుడు స్టార్ హీరోల‌లో ఒకరిగా ఉండ‌గా, ఆయ‌న రెమ్యునరేష‌న్ ప్ర‌తి సినిమాకి పెరుగుతూ పోతుంది. కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే వంద‌ల కోట్లు ప్రాప‌ర్టీ ఉన్న బ‌న్నీ ఓ వంద రూపాయ‌ల నోటుని చాలా జాగ్ర‌త్త‌గా దాచుకున్నాడ‌ట‌. ఈ విష‌యం తెలుసుకొని అంద‌రు అవాక్క‌వుతున్నారు. విష‌యం ఏంటంటే.. టాలీవుడ్‌లో ఎందరో హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు.. స్టార్ హీరోలుగా మార్చిన ఘనత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుది కాగా, బ‌న్నీని కూడా రాఘ‌వేంద్ర‌రావు లాంచ్ చేశారు. గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ ను దర్శకేంద్రుడు ప‌రిచ‌యం చేయ‌గా, ఆయన ఓ సందర్భంలో ఇచ్చిన వందరూపాయలనే బన్నీ చాలా ఇష్టంగా దాచుకున్నాడట‌.

బన్నీ డాన్స్.. యాక్టింగ్ చూసి ముగ్ధుడైన రాఘవేంద్ర రావు.. వెంటనే నా సినిమాలో నువ్వే హీరో అని వెంటనే.. అడ్వాన్స్ కింద ఓ 100 రూపాయ‌లు ఇచ్చాడట. ఇప్ప‌టికీ ఆ వంద రూపాయ‌ల‌ని చాలా ప‌దిలంగా దాచుకున్నాడ‌ట బ‌న్నీ. రాఘ‌వేంద్ర‌రావు ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు. ఒక‌ప్పుడు ఏఎన్నార్ డ్యాన్స్‌ల‌ని అంద‌రు ఎంజాయ్ చేసేవారు. పిల్ల‌లు డ్యాన్స్‌లు చేయ‌డం చిరంజీవి డ్యాన్స్ చూశాక మొద‌లైంది. ఒక‌సారి చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ సందర్భంగా నేను వెళ్ల‌గా, అక్కడ వాళ్ల ఫ్యామిలీలో పిల్లలంతా డాన్సులు చేశారు. బ‌న్నీ డ్యాన్స్ నాకు చాలా ముచ్చ‌ట‌గా అనిపించింది. అప్పుడు నేను పెద్ద‌య్యాక మంచి స్టార్ అవుతాడ‌ని చెప్పి వంద రూపాయ‌లు ఇచ్చాను. ఆ విష‌యం నేను మ‌రిచిపోయాను కాని వాళ్ల అమ్మ‌గారు నాకు గుర్తు చేశారు. బన్నీ ఇప్ప‌టికీ ఆ 100 రూపాయలు అలాగే దాచుకున్నాడని చెప్పిన‌ట్టు రాఘ‌వేంద్ర‌రావు పేర్కొన్నారు.