సినీ ప్రియుల‌కి పండ‌గే.. కొత్త ఓటీటీలో పసందైన విందు

  • By: sn    breaking    Jan 02, 2024 10:08 AM IST
సినీ ప్రియుల‌కి పండ‌గే.. కొత్త ఓటీటీలో పసందైన విందు

క‌రోనా స‌మ‌యం నుండి ఓటీటీలో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం ద‌క్కుతుంది. గ‌త ఏడాది ఓటీటీ కంటెంట్‌ని ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించారు. ఈ క్ర‌మంలో 2024లోను మంచి కంటెంట్‌తో అల‌రింప‌జేయాల‌ని ఓటీటీ నిర్వాహ‌కులు భావిస్తున్నారు. కొత్త సంవ‌త్సరంలో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియుల‌ని అల‌రించ‌బోతున్నాయో ఒక‌సారి చూద్దాం. ఈ వారం ఏకంగా 25 సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.నెట్‌ఫ్లిక్స్ లో చూస్తే.. బిట్‌కాన్డ్‌ (హాలీవుడ్‌) జనవరి 01 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఫూల్‌ మీ వన్స్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలానే ది బ్రదర్స్‌ సన్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుండ‌గా, ‘కన్జూరింగ్‌ కన్నప్పన్‌’ (చిత్రం) జనవరి 05 వ తేదీ నుంచి , గుడ్‌ గ్రీఫ్‌ (హాలీవుడ్‌) జనవరి 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్), మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ), యూ ఆర్ వాట్ యూ ఈట్: ఏ ట్విన్ ఎక్స్‌పరిమెంట్ (ఇంగ్లీష్), డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్), హాయ్ నాన్న (తెలుగు), సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్) చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి.

అమెజాన్‌ ప్రైమ్ లో చూస్తే .. టైగర్‌ (హిందీ) డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలానే మారీ మై హజ్బెండ్‌ (కొరియన్‌) జనవరి 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కాలింగ్ సహస్ర (తెలుగు), ఫో (ఇంగ్లీష్ మూవీ), జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్), లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్) చిత్రాలు ఈ వారమే సంద‌డి చేయ‌నున్నాయి. ఇక జియో సినిమాలో మెగ్‌2: ది ట్రెంచ్‌ (హాలీవుడ్‌) జనవరి 03 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇది తెలుగు డ‌బ్బింగ్ మూవీగా ప్రేక్ష‌కులకి వినోదం పంచ‌నుంది.

ఇక జీ5లో తేజస్‌ (హిందీ) జనవరి 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సోనీలివ్‌లో క్యూబికల్స్‌ (హిందీ) జనవరి 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బుక్ మై షోలో నాల్ 2 (మరాఠీ), ఏ సావన్నా హాంటింగ్(ఇంగ్లీష్), ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్), వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్) చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. హాట్‌స్టార్ లో ఇషురా (జపనీస్), పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం) చిత్రాలు సందడి చేయ‌నున్నాయి.