నామినేషన్స్ రచ్చ.. విచిత్రంగా ప్రవర్తిస్తూ అశ్వినికి పిచ్చెక్కించిన యావర్

బిగ్ బాస్ సీజన్ 7లో ప్రతి సోమ, మంగళ వారాలలో నామినేషన్స్ రచ్చ జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. నామినేషన్స్ అంటే హౌజ్‌మేట్స్ అందరు విచిత్రంగా మారిపోతారు. బద్ద శత్రవుల మాదిరిగా ప్రవర్తిస్తూ నోటికి ఎంత వస్తే అంత అనేస్తూ అవాక్కయ్యేలా చేస్తారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మంచి వాడి వేడిగా జరగగా, మంగళవారం కూడా ఈ ప్రక్రియ జరిగింది.ముందుగా శోభా శెట్టి, రతిక ఇద్దరు కూడా గట్టిగానే ఫైట్ చేశారు. శోభాకి బ్యాలెన్సింగ్ క్వాలిటీ లేదని రతిక ఆమెని కెప్టెన్సీ పోటీ నుండి తప్పించడంతో ఇది గుర్తు పెట్టుకున్న శోభా.. రతికని నామినేట్ చేసింది.
ఇక నామినేషన్ ప్రక్రియలో అశ్విని, యావర్ గొడవ ఎపిసోడ్‌కి హైలైట్ అని చెప్పారు. తనని అనవసరంగా నామినేట్ చేస్తున్నాడని యావర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది అశ్విని. నీపై రివెంజ్ తీర్చుకోవడం కోసమే నామినేట్ చేసానంటూ అశ్విని చెప్పగా, యావర్ నేను కూడా అంతే అన్నట్టు ప్రవర్తించాడు. అనవసరంగా నన్ను కెలుకుతున్నావ్ అని అశ్విని యావర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయగా, అప్పుడు యావర్.. అవును నాకు గోకించుకోవడం ఇష్టమే, వచ్చి గోకుతావా అంటూ చిత్ర విచిత్రంగా బిహేవ్ చేశాడు. ఆ సమయంలో అశ్విని తనని ఆడపిల్లని చేసి ఆడుకుంటున్నావ్ అని చెప్పింది.
బిగ్ బాస్ హౌజ్‌లో అందరు ఒక్కటే. నాగార్జున గారు ఇదే విషయం చెప్పారు కదా అంటూ ఆమెపై సెటైర్ వేశాడు. అప్పుడు అశ్విని కూడా యావర్ మాదిరిగా ఇమిటేట్ చేస్తూ.. ఎవరు పుల్లలు పెడుతున్నారో ఆంధ్ర, తెలంగాణ మొత్తం తెలుసు అని విచిత్రంగా డ్యాన్స్ చేసింది. మొత్తానికి ఆమెకి తక్కువ ఓట్స్ వచ్చిన క్రమంలో నామినేషన్స్ బయటపడింది. అయితే ఈ వారం నామినేషన్లో అమర్ దీప్, రతికా, శోభా శెట్టి, ప్రియాంక ,అర్జున్, భోలే, తేజ, యావర్ నామినేషన్స్ లో నిలవగా, వీరలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ మొదలైంది. ఇక నామినేషన్ టాస్క్ తర్వాత బిగ్ బాస్ అబ్బాయిలకు.. అమ్మాయిలని మహారాణుల్లా చూసుకోవాలని టాస్క్ ఇచ్చారు. దీనితో తేజ.. శోభా శెట్టిని తీసుకువెళ్లడం, ఆమెకి బ్రష్ చేయించడం, టిఫిన్ తినిపించడం వంటివి చేశాడు. ఇక ప్రశాంత్ తన పాత స్నేహితురాలు రతికకి బ్రేక్ ఫాస్ట్ తినిపించాడు. మొత్తంగా మంగళవారం ఎపిసోడ్ ఆసక్తికరంగానే సాగింది.