గుంటూరు కారంలో త్రివిక్రమ్ అంత పెద్ద తప్పు ఎలా చేశాడు.. ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్స్

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. సినిమా విడుదలైనప్పుడు మూవీకి దారుణమైన నెగెటివిటీ ఏర్పడగా, తర్వాత తర్వాత పుంజుకుంది అనే చెప్పాలి. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గుంటూరు కారం ఫిబ్రవరి 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఈ చిత్రాన్ని తెగ చూసేస్తున్నారట. ఈ క్రమంలో గుంటూరు కారం చిత్రం నెట్ ఫ్లిక్స్ నంబర్ 1 గా ట్రెండింగ్ అవుతుందని , వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ట్రెండింగ్ లో ఉన్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలియజేసింది.
గుంటూరు కారం చిత్రం ఓటీటీలోకి వచ్చారు కొందరు ఈ సినిమాని పదే పదే చూస్తున్న నేపథ్యంలో ఇందులో తప్పొప్పులని కూడా గుర్తిస్తున్నారు.ఈ చిత్ర కథ విషయానికి వస్తే భర్త, కొడుకుని వదిలేసి భార్య పుట్టింటికి వెళ్లిపోతుంది. అక్కడ ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వారికి ఓ కుమారుడు జన్మిస్తాడు. అయితే అతడిని ఆమెకి రాజకీయ వారసుడిగా చేయాలని హీరో తాత ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరో అడ్డు రాకూడదు అని సంతకం కూడా తీసుకుంటాడు. అయితే ఈ కథలో అనేక ఆసక్తికర అంశాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇక హీరో తండ్రి తన భార్య వెళ్లిపోయాక ఇంట్లో కూర్చుని పాత గ్రామోఫోన్ లో పాత పాటలు వింటూ కిటికీ దగ్గర కూర్చుని రోడ్డువైపు తదేకంగా చూస్తూ ఉంటాడు.
అయితే ఈ విషయంలో హీరో తన తండ్రిని ఏదో ఒక మాట అంటూ ఉంటారు. ఓ సారి “ఎప్పుడూ ఆ పాత పాటలు పెట్టుకుని.. ఆ కిటికీ వైపు చూస్తూ ఉంటావు. పోనీ భార్య కోసం చూస్తున్నాడా అంటే? హైదరాబాద్ అటు లేదు. ఇటు ఉంది” అంటూ ఓ డైలాగ్ విసురుతాడు. ఈ డైలాగ్ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుంది. అయితే క్లైమాక్స్‌లో హీరో పాత్ర తన తల్లిని తీసుకొని కారులో వస్తుండగా, తండ్రి అదే కిటికీ నుండి కారులో వస్తున్న భార్య చీరని చూస్తాడు. తన భార్య తన ఇంటికి వస్తుందని గ్రహిస్తాడు.అయితే ముందు హైదరాబాద్ అటు లేదు అని హీరోతో చెప్పించిన త్రివిక్రమ్… మళ్లీ హైదరాబాద్ లో ఉన్న తల్లిని తీసుకుని హీరో అదే కిటీకీ వైపు నుంచి రావడం గమనించిన నెటిజన్స్ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇది పెద్ద బ్లండర్ మిస్టేక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. థియేటర్లలో ఎవరూ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఓటీటీలోకి వచ్చాక మాత్రం దీనిపై పలు కామెంట్స్ చేస్తున్నారు.