మళ్లీ తల్లైన అనుష్క.. ఆ క్రికెటర్‌తో లింక్ పెట్టి దారుణంగా ట్రోలింగ్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రుల ప్రమోషన్ అందుకున్నారు. కొద్ది రోజులుగా అనుష్క ఆరోగ్యం బాగోలేదని, లేదు లేదు ఆమె డెలివరీకి సిద్ధంగా ఉందని, అందుకే విరాట్ కూడా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కి దూరంగా ఉన్నాడంటూ జోరుగా ప్రచారాలు సాగాయి. అయితే బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న తమకు కొడుకు పుట్టాడని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మేము ఫిబ్రవరి 15న మా తనయుడు అకాయ్‌ను ఈ లోకంలోకి స్వాగతించాం. మా జీవితంలోనే మధురమైన ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను కోరుకుంటున్నాం. మా ప్రైవసీని గౌరవించండి అంటూ విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.
అయితే అనుష్క రెండోసారి గర్భవతి అయినప్పుడు ఈ విషయం బయటకి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు విరాట్ కుటుంబ సభ్యులు.అయితే మాజీ క్రికెటర్ ఏబీ డీవిలియర్స్ మాత్రం ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ విషయం లీక్ చేసి హంగామా చేసారు. అయితే ఏబీ చెప్పిన మాటలను ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. దానిని ఏదో గాసిప్‌గానే చూశారు.అని విరాట్ కోహ్లీ సడెన్‌గా తమకు కొడుకు జన్మించాడని తెలియజేసే సరికి అందరు అవాక్కయ్యారు. డివిలియర్స్ చెప్పింది నిజం కావడంతో ఇప్పుడు నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్ట్‌లు పెడుతున్నారు. నేను చెబితే మీరు నమ్మడం లేదుగా ఫూల్స్.. ఇప్పుడు నా మాటే నిజమైంది అనే విధంగా డివిలియర్స్ మీమ్స్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు.
ఏబీ డీవిలియర్స్ రెండోసారి మామ అయ్యాడు అంటూ నెటిజన్లు మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. మొత్తానికి విరాట్, అనుష్కలు పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. పలువురు ప్రముఖులు, క్రీడాకారులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే విరుష్క దంపతులకి జనవరి 11, 2021న వామిక జన్మనించింది. ఇప్పటి వరకు వామిక ఫొటోను మీడియాకు రిలీజ్ చేయలేదు. తమ పిల్లలను బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచాలనుకుంటున్న ఈ జంట, తమ ప్రైవసీని గౌరవించాలని మీడియా సంస్థలకు లేఖ కూడా రాసారు. ఈ క్రమంలో వామిక ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. ఇక అకాయ్ పిక్ కూడా బయటకు వచ్చే అవకాశం లేదు.