Hyderabad Liberation Day | కేంద్రం సంచలన నిర్ణయం.. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే.. గెజిట్ నోటిఫికేషన్ జారీ..!

Hyderabad Liberation Day | నరేంద్ర మోదీ సర్కారు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్ 17 రోజున హైదరాబాద్ లిబరేషన్ డేగా నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విలీన దినోత్సవం రోజున అధికారిక కార్యక్రమాలను నిర్వహించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. భారతదేశం స్వాతంత్ర్యం పొందాక కూడా హైదరాబాద్ సంస్థానం 13 నెలల పాటు నిజాం పరిపాలనలోనే కొనసాగిందని.. 1948, సెప్టెంబన్ 17న పోలీస్ చర్య ఆపరేషన్ ‘పోలో’తో హైదరాబాద్ భారత్‌లో విలైనమైనట్లుగా నోటిఫికేషన్‌లో కేంద్రం తెలిపింది.
అయితే, సెప్టెంబర్ 17న హైదరాబాద్ విలీన దినోత్సవం నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ నోటిఫికేషన్‌లో పేర్కొంది. హైదరాబాద్ విముక్తి కల్పించిన అమరవీరులను గుర్తు చేసుకోవడంతో పాటు యువతలో దేశభక్తిని నింపేలా సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.