వ‌రుణ్‌-లావ‌ణ్య రిసెప్ష‌న్‌లో సెల‌బ్రిటీల సంద‌డి.. ఎవ‌రెవ‌రు వ‌చ్చారంటే..!

వ‌రుణ్‌-లావ‌ణ్య రిసెప్ష‌న్‌లో సెల‌బ్రిటీల సంద‌డి.. ఎవ‌రెవ‌రు వ‌చ్చారంటే..!

నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ త‌ను ప్రేమించిన లావ‌ణ్య త్రిపాఠితో న‌వంబ‌ర్ 1న ఏడ‌డుగులు వేసిన విష‌యం తెలిసిందే. ఇట‌లీలోని టుస్కానిలో వీరి వివాహం అట్ట‌హాసంగా జ‌రిగింది. మూడు రోజుల పాటు జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. అక్టోబర్ 30న కాక్ టైల్ పార్టీతో మొదలైన పెళ్లి వేడుకలలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నితిన్, ఉపాసన, స్నేహారెడ్డి ఫ్యామిలీతో పాటు ప‌లువురు తెగ సంద‌డి చేశారు. పెళ్లి ముగిసాక వీరంతా శ‌నివారం హైద‌రాబాద్ చేరుకున్నారు. ఇక హైద‌రాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

రిసెప్ష‌న్ వేడుకలలో వరుణ్ తేజ్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ సూట్ ధరించగా.. గోల్డ్ కలర్ చమ్కీల చీరలో మరింత అందంగా మెరిసిపోయింది లావణ్య. ఈ జంట‌కి ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఆశీర్వాదం అందించారు. వరుణ్ తేజ్ – లావణ్యల రిసెప్షన్ వేడుకకు కమెడియన్ అలీ కుటుంబంతో కలిసి హాజరై నూతన వధూవరులకి బొకేని అందించి ఆశీర్వదించారు. నటి ప్రగతి బ్యూటీఫుల్ శారీలో మెరిసి.. న్యూలీ మ్యారీడ్ కంపుల్ కు శుభాకాంక్షలు తెలిపింది. సుమ ఆమె త‌న‌యుడు క‌లిసి ఈ వేడుక‌కి హాజ‌ర‌య్యారు. ప్రముఖ నటుడు, ట్రైయినర్ సత్యానంద్ కూడా వీరి వివాహానికి హాజరై నూత‌న‌ వధూవరులని ఆశీర్వ‌దించారు.

అక్కినేని హీరో నాగచైతన్య, సునీల్, సుబ్బరాజ్, జయసుధ, మురళీకృష్ణ, యాంకర్ సుమతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా వేడుక‌కి హాజరయ్యారు. చైతూ స్టైలిష్ లుక్ లో మెరిసి అందరి దృష్టి త‌న‌పై ప‌డేలా చేశారు. చిరంజీవి, సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి వ‌చ్చారు. ప‌వ‌న్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ వంటి వారు ఎక్క‌డా కనిపించ‌లేదు. వీరికి సంబంధించిన పిక్స్ అయితే బ‌య‌ట‌కు రాలేదు. ఇక ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత ఎట్టకేళలకు వరుణ్ తేజ్ – లావణ్య ఒక్కటవడం.. పెళ్లి, రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరుపుకోవ‌డం చూసి మెగా ఫ్యాన్స్ తెగ సంబర‌ప‌డిపోతున్నారు. ఈ జంట నిండు నూరేళ్లు సంతోషంగా క‌లిసి ఉండాలని ప్రార్ధిస్తున్నారు.