వేణు స్వామి వెన‌క క్యూ క‌డుతున్న హీరోయిన్స్.. ఇంకెంత మంది ఆయ‌న‌తో పూజలు చేయిస్తారు.!

వేణు స్వామి వెన‌క క్యూ క‌డుతున్న హీరోయిన్స్.. ఇంకెంత మంది ఆయ‌న‌తో పూజలు చేయిస్తారు.!

సైన్స్ రోజురోజుకి కొత్త పుంత‌లు తొక్కుతుంది. సైన్స్ వ‌ల‌న అనేక కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. సైన్స్ ఎంత వృద్ధి చెందిన కూడా జ్యోతిష్యంని న‌మ్మేవారు లేక‌పోలేదు. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం జ్యోతిష్యంని తెగ న‌మ్మేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా వేణుస్వామి జ్యోతిష్యాన్ని బాగా న‌మ్ముతున్నారు. వేణు స్వామి జ్యోతిష్యం చెప్ప‌టంతో పాటు సెల‌బ్రిటీల ఇళ్ల‌లో పూజ‌లు, యాగాలు నిర్వ‌హిస్తుంటారు. స‌మంత‌, నాగ చైత‌న్య విడాకుల గురించి ముందే ఊహించి వేణు స్వామి చెప్ప‌డంతో ఆయ‌న‌ని న‌మ్మ‌డం మొద‌లు పెట్టారు మ‌న సెల‌బ్స్. ఆయ‌న‌తో ప్ర‌త్యేకంగా పూజ‌లు కూడా చేయించుకుంటున్నారు.

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ఇంట్లో కొన్ని సంవ‌త్స‌రాల క్రితం పూజ‌లు చేసిన వేణు స్వామి ఆ త‌ర్వాత నిధి అగ‌ర్వాల్ ఇంట్లో కూడా పూజ‌లు చేశాడు.. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. వేదమంత్రాల నడుమ వారితో కలశానికి పూజలు చేయించిన‌ట్టు స‌మాచారం.. రాజ శ్యామ‌ల యాగం చేయించిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత డింపుల్ హ‌య‌తితో వేణు స్వామి పూజ చేయించుకున్న‌ట్టు కూడా కొన్ని ఫొటోల‌ని బ‌ట్టి తేలింది. ఇటీవల బిగ్‌బాస్‌ బ్యూటీ ఇనయ సుల్తానా.. వేణుస్వామితో ప్ర‌త్యేక‌ పూజలు చేయించుకుంది. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆమెకు అదృష్టం ఎంతగా కలిసోచ్చిందో తెలియదు కానీ.. ఇనయ తర్వాత మరో బిగ్‌బాస్‌ బ్యూటీ అషు రెడ్డి వేణు స్వామిని ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

అషూరెడ్డి తన ఇంట్లో వేణు స్వామితో ప్రత్యేకంగా పూజలు చేయించుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. చూస్తుంటే చాలా పవర్ ఫుల్ పూజలే చేయించినట్టుగా కనిపిస్తోంది. బగ్లాముఖిదేవి, రాజ శ్యామలా దేవీ పూజలను చేయించినట్టుగా టాక్ న‌డుస్తుంది. ప్ర‌స్తుతం కెరీర్ గాడి తప్పిన‌ట్టు క‌నిపిస్తున్న నేప‌థ్యంలో వేణు స్వామితో అషూ రెడ్డి ఈ పూజ‌లు చేయించుకుంద‌ని కొంద‌రు అంటున్నారు. అషూ రెడ్డి విష‌యానికి వ‌స్తే జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి రెండు సార్లు బిగ్ బాస్ షోకి వెళ్లి సంద‌డి చేసింది. ఇక రామ్ గోపాల్ వ‌ర్మ‌తో క‌లిసి బోల్డ్ ఇంట‌ర్వ్యూ కూడా చేసింది. ఆ ఇంట‌ర్వ్యూతో ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీ ద‌క్కించుకుంది. అషూ సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.