ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కండి.. కేటీఆర్‌తో ఎమ్మ్యెల్యే రాజ‌గోపాల్‌.. ఏంటది?

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే అసెంబ్లీ లాబీలో కేటీఆర్, రాజ‌గోపాల్ రెడ్డి మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది.

ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కండి.. కేటీఆర్‌తో ఎమ్మ్యెల్యే రాజ‌గోపాల్‌.. ఏంటది?

హైద‌రాబాద్ : అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ స‌మావేశాల‌కు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. అయితే అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది.

మంత్రి ప‌ద‌వి ఎప్పుడు వ‌స్తుంద‌ని రాజ‌గోపాల్‌ను కేటీఆర్ అడిగారు. మీలాగే త‌మ‌కూ ఫ్యామిలీ ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్యామిలీ పాల‌న కాదు.. బాగా ప‌ని చేస్తే కీర్తి ప్ర‌తిష్ఠ‌లు వ‌స్తాయ‌ని కేటీఆర్ అన్నారు. ఎంపీగా మీ కుమార్తె కీర్తి పోటీ చేస్తారా..? సంకీర్త్ పోటీ చేస్తారా..? అని కేటీఆర్ రాజ‌గోపాల్ రెడ్డిని ప్ర‌శ్నించారు. దీంతో ద‌య‌చేసి త‌న‌ను వివాదాల్లోకి లాగొద్ద‌ని రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కేసీఆరే బీజేపీలోకి పంపుతార‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. 


నాకు హోంశాఖ ఇస్తే వాళ్లను జైళ్లో వేయిస్తా: రాజగోపాల్ రెడ్డి


నాకు హోంశాఖ ఇస్తే కేసీఆర్ సహా వారి కుటుంబ సభ్యులను జైళ్లో వేయిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన సందర్భంగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి తాను కాంగ్రెస్ లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకని అన్నారు. నేనూ హోంమంత్రి అయితేనే వాళ్ళు(కేసీఆర్ కుటుంబం) కంట్రోల్‌లో ఉంటారన్నారు. అసెంబ్లీ తరువాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని, నాకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. నేను హోం శాఖ ఇవ్వాలని కోరుతున్నానన్నారు.