సీపీఎం సీనియ‌ర్ నాయ‌కుడు ఎన్ శంక‌ర‌య్య క‌న్నుమూత‌

సీపీఎం సీనియ‌ర్ నాయ‌కుడు ఎన్ శంక‌ర‌య్య క‌న్నుమూత‌

చెన్నై : స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, సీపీఎం సీనియ‌ర్ నాయ‌కుడు ఎన్ శంక‌ర‌య్య‌(102) ఇక లేరు. చెన్నైలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో వైర‌ల్ ఫీవ‌ర్‌తో చికిత్స పొందుతూ బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. శంక‌య్య మృతిప‌ట్ల సీపీఎం పార్టీతో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించారు.

ఎన్ శంక‌ర‌య్య త‌మిళ‌నాడులోని ట్యుటికోరిన్‌లో జ‌న్మించారు. 1941 స‌మ‌యంలో స్వాతంత్య్ర ఉద్య‌మంలో చురుకుగా పాల్గొన్నారు. మ‌ధురైలోని అమెరిక‌న్ కాలేజీలో స్టూడెంట్‌గా ఉన్న స‌మ‌యంలో 18 నెల‌ల పాటు జైలు జీవితం గ‌డిపారు. ఆయ‌న జీవిత‌కాలంలో ఓ ఎనిమిదేండ్ల పాటు జైలు జీవితం అనుభ‌వించారు. ఇక మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవ‌లందించారు.