Viral video | బీహార్‌లో కారులో మ‌ద్యం బాటిళ్లు.. ఎగ‌బ‌డి ఎత్తుకెళ్లిన జ‌నాలు

Viral video | బీహార్‌లో కారులో మ‌ద్యం బాటిళ్లు.. ఎగ‌బ‌డి ఎత్తుకెళ్లిన జ‌నాలు

Viral video | ఓ కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది.. డ్రైవ‌ర్ పారిపోయాడు. అందులో ఉన్న మ‌ద్యం బాటిళ్ల‌ను దొంగిలించారు స్థానికులు. ఈ ఘ‌ట‌న బీహార్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని నేష‌న‌ల్ హైవే-2పై వేగంగా వెళ్తున్న కారు.. మ‌రో వాహ‌నాన్ని ఢీకొట్టింది. దీంతో వాహ‌నాలు నిలిచిపోయాయి. ప్ర‌మాదానికి గురైన కారు చుట్టూ వాహ‌న‌దారులు, స్థానికులు గుమిగూడారు. ఆ కారులో మ‌ద్యం బాటిల్స్ క‌నిపించాయి. అప్ప‌టికే డ్రైవ‌ర్ పారిపోవ‌డంతో, మ‌ద్యం బాటిళ్ల‌ను దొంగిలించారు. ఎగ‌బ‌డి ఎత్తుకెళ్లారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అప్ప‌టికే మ‌ద్యం బాటిళ్ల‌ను అన్నింటిని లూటీ చేశారు. కారులో విదేశీ మ‌ద్యం బాటిళ్ల‌ను తీసుకెళ్తున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బీహార్‌లో 2016 నుంచి మ‌ద్య నిషేధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.