నన్ను అలా పిలవొద్దు, ఆ ట్యాగ్ నాకు వద్దే వద్దు అంటూ విరాట్ కోహ్లీ రిక్వెస్ట్

కొన్నాళ్లుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్‌తో గ్రౌండ్‌లో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం అవుతుండగా, అందరు ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు తమ లుక్స్‌తోను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. విరాట్ ఎప్పటికప్పుడు తన ఆటతోనే కాకుండా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ ఐపీఎల్ సందర్భంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. నయా లుక్‌లో విరాట్ సింప్లి సూపర్బ్‌గా ఉన్నాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం పర్యవేక్షణలో కోహ్లీ ఇలా కనిపిస్తున్నాడు. ఆయన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే కోహ్లీ తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. దయచేసి తనను కింగ్ అని పిలవద్దని , అలా పిలుస్తుంటే చాలా ఇబ్బందిగా ఉందని కేవలం విరాట్ అని మాత్రమే పిలవాలని సూచించాడు. మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్‌సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌కు వేల సంఖ్యంలో అభిమానులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో తొలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అందుకున్న స్మృతి మంధాన & కో. చిన్నస్వామి ఆర్సీబీ పురుషుల జట్టు నుండి ప్రత్యేక గౌరవం అందుకుంది. అనంతరం కోహ్లి మైక్ తీసుకొని ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఆ సమయంలో కోహ్లీ తన కోసం ‘కింగ్’ ట్యాగ్‌ని ఉపయోగించవద్దని అభిమానులను కోరాడు.
నాకు ఆ ట్యాగ్ ఇబ్బందిగా ఉంది, దయచేసి ఆ ట్యాగ్‌ని తొలగించి విరాట్ అని మాత్రమే పిలవాలంటూ రిక్వెట్ చేశాడు. అయితే కోహ్లీ ఐపీఎల్ లో జట్టు గెలుపు కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటాడు. అందుకే అతనికి అభిమానులు కింగ్ అనే బిరుదు ఇచ్చారు. సచిన్‌ని అభిమానులు క్రికెట్ దేవుడు అని ఎలా పిలుచుకుంటారో, కోహ్లీని కింగ్‌గా పిలుచుకుంటున్నారు. అయితే ఆ ట్యాగ్ తనకి వద్దని కోహ్లీ కోరడం విశేషం. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆర్‌సీబీ ఒక్కసారిగా కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగళూరు కప్పు గెలవాలని ఆర్‌సీబీ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.