42 ఏళ్ల అనుష్క ఇంకా బరువు త‌గ్గ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదా.. విష‌యం తెలిసి అంద‌రు షాక్..!

42 ఏళ్ల అనుష్క ఇంకా బరువు త‌గ్గ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదా.. విష‌యం తెలిసి అంద‌రు షాక్..!

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఎంట‌ర్‌టైన్ చేసిన అందాల భామ అనుష్క‌. ముందుగా హీరోయిన్‌గా న‌టించిన అనుష్క ఆ త‌ర్వాత లేడి ఓరియెంటెడ్ పాత్ర‌లు చేసి మెప్పించింది. అరుంధ‌తి సినిమాలో జేజ‌మ్మ‌గా అనుష్క ప‌ర్‌ఫార్మెన్స్ ఇప్ప‌టికీ ఎవ‌రు మ‌ర‌చిపోలేదు. ఈ సినిమా త‌ర్వాత అనుష్క ప‌లు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసి అల‌రించింది. బాహుబ‌లిలో దేవ‌సేన అనే పాత్ర పోషించి నేష‌న‌ల్ స్టార్‌డ‌మ్ ద‌క్కించుకుంది. అయితే స్టార్ ఇమేజ్ ద‌క్కించుకున్న అనుష్క ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.. ఏదో అడపదడపా ఒక సినిమా చేస్తూ వ‌స్తుంది. పబ్లిక్ అపీయరెన్స్ కూడా ఫ్యాన్స్ కు కరువైపోయింది అనే చెప్పాలి.

ఇటీవ‌ల న‌వీన్ పోలిశెట్టితో క‌లిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే చిత్రం చేసింది. ఈ మూవీ మంచి విజ‌య‌మే సాధించింది. అయితే ఈ చిత్ర ప్రచారంలో అనుష్క శెట్టి కనిపించలేదు. ఒకటి రెండు ఇంటర్వ్యూలు మినహా పెద్దగా పబ్లిక్ కి క‌నిపించేందుకు ఆస‌క్తి చూపించ‌లేదు. అందుకు కార‌ణం తాను భారీగా బ‌రువు పెర‌గ‌డ‌మేన‌ని చెబుతున్నారు. సైజ్ జీరో కోసం భారీగా పెరిగిన అనుష్క అప్ప‌టి నుండి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ని ఫేస్ చేస్తుంది. ఈ సినిమా కోసం ఏకంగా 20 కిలోలు పెరిగిన అనుష్క అప్ప‌టి నుండి బ‌రువు త‌గ్గేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అయిన‌ప్ప‌టికీ కూడా త‌గ్గ‌లేక‌పోతుంది. ఒకేసారి బరువు పెరగడంతో అనుష్క పాలిసిస్టిక్ ఓవ‌రి సిండ్రోమ్ తో బాధపడుతున్నట్టు గతంలో చెప్పుకొచ్చింది. దీని వల్ల హార్మోనల్ డిజార్డర్ కు గురై బరువు పెరుగుతున్నట్టు తెలియ‌జేసింది.

బ‌రువు ఒకేసారి పెర‌గ‌డం వ‌ల‌న అనుష్క‌కి హెల్త్ ఇష్యూస్ చాలానే వ‌చ్చాయ‌ట‌. ఆ స‌మస్య‌ల నుండి బ‌య‌ట‌పడేందుకు అనుష్క ఎంత‌గానో ట్రై చేస్తుంది. బ‌రువు భారీగా పెర‌గ‌డం వ‌ల‌న చిత్ర ప్ర‌చారాల‌కి దూరంగా ఉంటూ, పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేద‌ని కొంద‌రు అంటున్నారు. నిన్న‌టితో అనుష్క 42వ ప‌డిలోకి అడుగుపెట్ట‌గా, ఆమెకి సినీ ప్ర‌ముఖులు అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక ఆమె వ‌య‌స్సు తెలుసుకొని కూడా షాక్ అవుతున్నారు. అప్పుడే అనుష్కకి 42 సంవ‌త్స‌రాలు వ‌చ్చాయా అని కామెంట్స్ చేస్తున్నారు.