New SP’s For 14 Districts in AP | ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం
ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం.. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కొందరిని బదిలీ చేసి కొత్తవారిని నియమించారు.

అమరావతి : ఏపీలో ఐపీఎస్ ల బదిలీల ప్రక్రియలో భాగంగా 14జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించగా..మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తున్నారు.
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ ఎస్పీగా రాహుల్ మీనా, బాపట్లకు ఉమామహేశ్వర్, కృష్ణా జిల్లాకు విద్యాసాగర్ నాయుడు, నెల్లూరుకు అజితా వేజెండ్ల, తిరుపతికి సుబ్బరాయుడు, అన్నమయ్య జిల్లాకు ధీరజ్ కునుగిలి, కడపకు నచికేత్, గుంటూరు కు వకుల్ జిందాల్, నంద్యాల ఎస్పీగా సునీల్ షెరాన్, విజయనగరంకు ఏఆర్ దామోదర్, పల్నాడుకు డి.కృష్ణారావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజులను నియమించారు.