Harish Rao| అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికను వ్యతిరేకిస్తూ హైకోర్టులో హరీష్ రావు హౌజ్ మోషన్ పిటిషన్
హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ – కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని హైకోర్టును ఆశ్రయించారు!

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)ను అసెంబ్లీ (Telangana Assembly)లో ప్రవేశ పెట్టకుండా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్(BRS) మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) శనివారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో అత్యవరసంగా హౌజ్ మోషన్ (House Motion Petition)పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావులు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(PC Ghose Commission) నివేదికను రద్దు చేయాలని హైకోర్టులో కేసు వేయడం..ఆ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించి విచారణ వాయిదా వేయడం జరిగింది.
తాజాగా హరీష్ రావు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలంటూ హైకోర్టును ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెడితే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్న హరీష్ రావు ఇప్పుడు నివేదికను అసెంబ్లీలో పెట్టవద్ధంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం రేపు ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టనుందని సమాచారం.