KCR Emergency Meeting| ఫామ్ హౌజ్ లో కేసీఆర్ అత్యవసర భేటీ!

KCR Emergency Meeting| ఫామ్ హౌజ్ లో కేసీఆర్ అత్యవసర భేటీ!

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర భేటీ(Emergency Meeting) అయ్యారు. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission Report) నేడో రేపో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందన మేరకు అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై కేసీఆర్ చర్చించేందుకు ఈ అత్యవసర భేటీ నిర్వహించినట్లుగా సమాచారం. ఈ భేటీలో కేసీఆర్ తో పాటు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao), జి.జగదీష్ రెడ్డి(Jagadish Reddy)లు పాల్గొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission)కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై సుధీర్ఘ విచారణ చేసి తుది నివేదినకు సిద్ధం చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023ఆక్టోబర్ 21న కుంగిన నేపథ్యంలో విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. 115మంది సాక్షులను విచారించి న్యాయ సవాళ్లకు నిలిచేలా తుది నివేదికను రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 31న జస్టిస్ ఘోష్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందనుందని సమాచారం. మరోవైపు విద్యుత్ సంస్థల్లో అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వానికి  ఫైనల్ రిపోర్ట్ అందింది.