Ather Rizta: చరిత్ర సృష్టించిన ఏథర్ రిజ్టా.. విడుదలైన ఏడాదిలోనే లక్ష యూనిట్ల అమ్మకాలు

Ather Rizta: చరిత్ర సృష్టించిన ఏథర్ రిజ్టా.. విడుదలైన ఏడాదిలోనే లక్ష యూనిట్ల అమ్మకాలు

బెంగళూరు,: భారతదేశ ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్, తమ ఫ్యామిలీ స్కూటర్ రిజ్టా, విడుదలైన సంవత్సరంలోనే ఒక లక్ష రిటైల్ అమ్మకాల మైలురాయిని దాటిందని ప్రకటించింది. ఏప్రిల్ 2024లో విడుదలైనప్పటి నుండి, భారతదేశవ్యాప్తంగా కుటుంబ స్కూటర్ కొనుగోలుదార్ల నుండి రిజ్టాకు అపూర్వమైన ఆదరణ లభించింది. ఇది ఏథర్ మార్కెట్ వాటా గణనీయంగా పెరగడానికి సహాయపడింది. ఈ మైలురాయి గురించి ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఫోకెలా మాట్లాడుతూ, “రిజ్టాతో ఒక లక్ష యూనిట్ల మైలురాయి చేరుకోవడం మాకు సంతోషం కలిగించింది.

భారతీయ కుటుంబాల అవసరాలను తీర్చడంపై దృష్టి సారించి, ప్రారంభం నుండి తయారుచేసిన రిజ్టా, మా పరిధిని విస్తరించడానికి, విస్తృతశ్రేణి కస్టమర్లతో కనెక్ట్ కావడంలో కీలక పాత్ర పోషించింది. ఇది కుటుంబ స్కూటర్‌కు అవసరమైన ప్రతి దానిని కలిగి ఉంది – ఏథర్ ప్రసిద్ధి చెందిన గొప్ప డిజైన్‌లో విశాలమైన, సౌకర్యవంతమైన సీటు, తగినంత నిల్వ స్థలం, భద్రతా అంశాలు, రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేయగల విశ్వసనీయత కలిగి ఉంటుంది. విడుదలైన ఒక సంవత్సరం లోపే పలు రాష్ట్రాల్లో మా మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకోవడానికి, వినియోగదారుల ప్రొఫైల్‌ను విస్తరించడానికి, గతంలో మా కార్యకలాపాలు పరిమితంగా ఉన్న రాష్ట్రాలలో మా వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి రిజ్టా మాకు తోడ్పడింది.” అని పేర్కొన్నారు.

రిజ్టా విజయానికి కారణాలు

ఏథర్ మొదటి కుటుంబ స్కూటర్ అయిన రిజ్టా, ఏథర్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. దేశంలో అధిక శాతం ఉన్న వినియోగదార్ల విభాగానికి సేవ చేయడంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఆర్ధిక సంవత్సరం 2025 రెండవ త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమైన తర్వాత, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సహా పలు కీలక రాష్ట్రాల్లో ఏథర్ మార్కెట్ వాటా గణనీయంగా పెరిగింది. విడుదలైన తర్వాత, అధిక శాతం మంది కొనుగోలుదార్లకు రిజ్టా ప్రాధాన్య ఎంపికగా నిలిచింది. ఏథర్ మొత్తం అమ్మకాల్లో దాదాపు 60% వాటాను ఇది సొంతం చేసుకుంది. స్మార్ట్ టెక్నాలజీ, సౌకర్యంతో కూడిన రోజువారీ వినియోగాన్ని సమతుల్యం చేసే బలమైన ఫీచర్ల ద్వారా ఇది వాహన వినియోగదార్ల మనసు గెలుచుకుంది. అంతేకాకుండా, వాహన్ డేటా ప్రకారం, రిజ్టా, ఏథర్ 450 సిరీస్‌లు దక్షిణ భారతదేశంలో #1 బ్రాండ్‌గా ఏథర్ అవతరించడానికి సహాయపడ్డాయి.

రిజ్టా భద్రత, సౌకర్యవంతమైన ఫీచర్లు

రైడ్ సౌకర్యాన్ని పెంచడానికి, రిజ్టా అనేక భద్రత, కనెక్ట్ చేసిన ఫీచర్లను కలిగి ఉంది. వీటిలో 56 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, విశాలమైన, సౌకర్యవంతమైన సీటు, అనుకూలమైన ఫ్లోర్‌బోర్డ్ వంటివి ఉన్నాయి. స్కిడ్‌కంట్రోల్ అనే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్- ఇది కంకర, ఇసుక, నీరు లేదా నూనె వంటి తక్కువ-ఘర్షణ ఉపరితలాలపై ట్రాక్షన్ నష్టాన్ని నివారించడానికి మోటర్ టార్క్‌ను నిర్వహిస్తుంది- రిజ్టాలో పరిచయం చేశారు. ఇతర భద్రతా అంశాలలో టో & థెఫ్ట్ అలర్ట్ ఉన్నాయి, ఇది తమ స్కూటర్ల అనధికార కదలిక గురించి యజమానికి తెలియజేస్తుంది.

మీరు అకస్మాత్తుగా ఆగిపోతున్నారని వెనుక ఉన్న వాహనానికి సూచించడానికి టెయిల్ లైట్‌ను వేగంగా వెలిగించే ఎమర్జెన్సీ స్టాప్ సిస్టమ్ కూడా రిజ్టాకు ఉంది. అదనంగా, ఏథర్‌స్టాక్ 6 లో భాగమైన సాఫ్ట్‌వేర్ ఆధారిత ‘లైవ్ లొకేషన్ షేరింగ్’ రైడర్‌లకు కొన్ని క్లిక్‌లలోనే ముందుగా నిర్దేశించుకున్న కాంటాక్ట్‌తో తమ స్థానాన్ని పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో రైడర్‌ల భద్రతను పెంచుతుంది. సులభమైన నావిగేషన్ కోసం డాష్‌బోర్డ్ పై గూగుల్ మ్యాప్స్ కూడా చూపుతుంది. రిజ్టాను మొదట ఏప్రిల్ 2024లో జరిగిన ఏథర్ కమ్యూనిటీ డేలో ఆవిష్కరించారు. జూన్ 2024 నుండి దేశవ్యాప్తంగా వాణిజ్య విక్రయాలు ప్రారంభమయ్యాయి