Budget 2024 | కూరగాయల ఉత్పత్తికి త్వరలో మెగా క్లస్టర్లు.. బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Budget 2024 | పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. వరుసగా ఏడోసారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆహార ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1శాతానికి పరిమితమైందని పేర్కొన్నారు.

Budget 2024 | కూరగాయల ఉత్పత్తికి త్వరలో మెగా క్లస్టర్లు.. బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Budget 2024 | పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. వరుసగా ఏడోసారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆహార ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1శాతానికి పరిమితమైందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధర గణనీయంగా పెంచామన్నారు. కనీసం 50శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించామన్నారు. ద్రవ్యోల్బణం 4శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సంవృద్ధి సాధించడం ప్రధానమని, తొమ్మిది ప్రధాన అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ తయారైందన్నారు. ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఎంఎస్‌ఎంఈ, మధ్యతరగతి కేంద్రంగా బడ్జెట్‌ ఉంటుందని.. విద్యా, నైపుణ్యాభివృద్ధి కోసం రూ.1.48లక్షలకోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 కొత్త వండగాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కూరగాయల ఉత్పత్తికి త్వరలో మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వినియోగం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తగ్గరలోనే కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు ఏర్పాటవుతాయన్నారు. వ్యవసాయరంగంలో ఉత్పాదకత, సుస్థిరతకు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. కూరగాయల స్లపయ్‌ చైన్‌ నిర్వహణకు కొత్త స్టార్టప్‌లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. సేకరణ, నిల్వ, సరఫరాకు తగిన పెట్టుబడులు అందుబాటులోకి తెస్తామన్నారు. కూరగాయలు ఉత్పత్తి చేసే 6కోట్ల మంది రైతుల డేటా సేకరణ చేస్తామన్నారు. సహకార రంగాన్ని సుస్థిరం చేసేందుకు నిర్మాణాత్మక విధానాలకు రూప కల్పన, ఉద్యోగాల కల్పన నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో నైపుణాభివృద్ధి సంస్థలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివల కోసం కొత్తగా మూడు పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. కొత్త ఉద్యోగాల కల్పనలో తొలి నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుందని.. కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ చెల్లింపుల్లో మొదటి నాలుగేళ్లు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. తూర్పు భారత రాష్ట్రాల్లో దేవాదాయ సాంస్కృతిక పరిరక్షణకు ప్రత్యేక పథకం తెస్తామన్నారు. బిహార్‌, జార్ఖండ్‌, బెంగాల్‌, ఒడిశా, ఏపీలో దేవాదాయ సాంస్కృతిక పరిరక్షణకు ప్రత్యేక పథకం ఉంటుందన్నారు.