సామాన్యులకు ఊరట..! హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

సామాన్యులకు ఊరట..! హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరుగుతూ వచ్చిన ధరలు నిలకడగా ఉండడంతో కొనుగోలుదారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. రాబోయే ధన త్రయోదశి, దీపావళి వరకు బంగారానికి మరింత డిమాండ్‌ పెరిగే అవకాశం ఉన్నది. ఇటీవల భారీగా పెరుగుతూ వచ్చిన ధరలతో సామాన్యులు బాబోయ్‌ బంగారం అనే పరిస్థితి వచ్చింది. ఇక సోమవారం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.56,500 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారం రూ.61,640 వద్ద స్థిరంగా ఉన్నది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,790 వద్ద కొనసాగుతున్నది.


ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,640 వద్ద నిలకడగా ఉన్నది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.57,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,350 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్‌లో ధర విషయానికి వస్తే 22 క్యారెట్ల పసిడి రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61,640 వద్ద స్థిరంగా ఉన్నది. ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం నిలకడగా ఉన్నాయి. వెండి హైదరాబాద్‌లో కిలోకు రూ.78వేలు పలుకుతున్నది.