పైపైకి బంగారం ధరలు..! మళ్లీ రూ.59వేల మార్క్‌ను దాటిన పుత్తడి..!

విధాత: బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. నిన్న కాస్త ఊరటనిచ్చిన ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. తాజాగా 22 గ్రాముల పసిడి పసిడిపై రూ.350 పెరిగి తులానికి రూ.54వేల మార్క్‌ను తాకింది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.380 పెరిగి పది గ్రాములకు రూ.58,910కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,060కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,910కి ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం ధ రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,070 వద్ద ఉన్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54వేలకు చేరగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,910కి చేరింది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం భారీగానే పెరుగుతున్నాయి. తాజాగా రూ.500 పెరిగి కిలోకు రూ.72,600 పలుకుతున్నది. హైదరాబాద్‌లో ధర రూ.75,500 చేరింది. ఇదే సమయంలో ప్లానిటం ధరలు సైతం పైకి కదిలాయి. 10 గ్రాముల ప్లాటీనం ధర రూ.23,740కి చేరింది.