ధన త్రయోదశి వేళ బంగారం కొనుగోలుదారులకు ఊరట..! భారీగా పతనమైన బంగారం..!

ధన త్రయోదశి వేళ కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. పుత్తడి ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.400 తగ్గి తులం రూ.55,700 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.440 తగ్గడంతో రూ.60,760కి తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,910కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,760 వద్ద ట్రేడవుతున్నది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,250కి పతనమైంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55,700 ఉండగా.. క్యారెట్ల గోల్డ్ రూ.60,760 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం స్వల్పం తగ్గాయి. రూ.300 తగ్గి కిలోకు రూ.73,200కి పతనమైంది. హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.76,200 పలుకుతున్నది.