బులియన్‌ మార్కెట్‌లో ఆదివారం పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండడం ఊరటకలిగించే విషయమే

Gold Rates | బులియన్‌ మార్కెట్‌లో ఆదివారం పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండడం ఊరటకలిగించే విషయమే. 22 క్యారెట్ల బంగారం తులం రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.62,950 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,600 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,950 వద్ద కొనసాగుతున్నది.

ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,100 చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,950 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.76,500 ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Subbu

Subbu

Next Story