సంక్రాంతి వేళ మగువలకు షాక్‌.. భారీగా పెరిగిన పసిడి ధరలు..!

సంక్రాంతి పండుగ వేళ మగువలకు పుత్తడి ధరలు షాక్‌ ఇచ్చాయి. వరుసగా రెండోరోజూ బంగారం ధరలు భారీగానే పెరిగాయి

సంక్రాంతి వేళ మగువలకు షాక్‌.. భారీగా పెరిగిన పసిడి ధరలు..!

Gold Rates | సంక్రాంతి పండుగ వేళ మగువలకు పుత్తడి ధరలు షాక్‌ ఇచ్చాయి. వరుసగా రెండోరోజూ బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.300 పెరిగి తులం రూ.58వేలకు ఎగిసింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.320 పెరిగింది. తులం ధర రూ.63వేల మార్క్‌ను దాటి.. రూ.63,270 పలుకుతున్నది. వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. కిలోకు రూ.500 పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,750 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.58వేలు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.63,270కి ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.63,420కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.58వేలు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.63,270 ధర పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తున్నది. రూ.500 పెరిగి కిలో ధర రూ.76,500కి పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78వేలకు చేరింది.