సరికొత్త బైక్‌ను లాంచ్‌ చేసిన హోండా మోటార్స్‌.. బైక్‌ ఫీచర్స్‌ ఏంటో చూసేయండి మరి..!

సరికొత్త బైక్‌ను లాంచ్‌ చేసిన హోండా మోటార్స్‌.. బైక్‌ ఫీచర్స్‌ ఏంటో చూసేయండి మరి..!

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హోండా మోటార్స్‌ భారత్‌లో కొత్తగా బైక్‌ను తీసుకువచ్చింది. ఈ మోడల్‌కు ఎక్స్‌ఎల్‌-750 ట్రాన్సల్ప్‌గా నామకరణం చేసింది. ఈ మోడల్‌ సీబీయూ ద్వారా జపాన్​ నుంచి భారత్‌కు తీసుకువస్తున్నది. ఈ కొత్త ఎక్స్‌ఎల్‌-750 బైక్‌ 1980 దశకంలో డిమాండ్‌ ఉన్న ట్రాన్సల్ప్‌ మోడల్‌ను పోలి ఉన్నట్లు తెలుస్తున్నది. కాంపాక్ట్​ హెడ్​లైట్​, ఇంటిగ్రేటెడ్​ విండ్​స్క్రీన్​ బైక్‌లో ఉండనున్నాయి. రియర్‌లో ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌, అల్యూమినియం కారియర్‌ ఉండనున్నాయి.


ఈ బైక్​కు 21 ఫ్రెంట్​ వీల్​, 18 ఇంచ్​ రియర్‌ వీల్​ వస్తాయి. ఫలితంగా ఆఫ్​ రోడ్​లో స్మూత్​ రైడ్​ ఫీలింగ్​ పొందొచ్చు. ఇక ఫీచర్స్‌ విషయానికి వస్తే.. ఇందులో 5.0 ఇంచ్​ టీఎఫ్​టీ ప్యానెల్​, స్పీడోమీటర్​, టాకోమీటర్​, గేర్​ పొజిషన్​ ఇండికేటర్​, ఫ్యూయెల్​ గేజ్​, కన్సమ్షన్​, రైడింగ్​ మోడ్స్​, ఇంజిన్​ పారామీటర్స్​ వంటివి డిస్​ప్లే అవనుండగా.. వీటిని కస్టమైజ్​ చేసుకునే అవకాశం ఉన్నది. అడ్వెంచర్​ టూరర్​లో స్మార్ట్​ఫోన్​ వాయిస్​ కంట్రోల్​ సిస్టమ్‌ ఉంటుంది. ఫలితంగా బైక్‌కి స్మార్ట్‌ఫోన్‌ను లింక్‌ చేసుకోవచ్చని.. వాయిస్‌ మేనేజ్‌మెంట్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు, మ్యూజిక్‌, నావిగేషన్‌ ఆప్షన్‌ సైతం పొందొచ్చు.


ఇందులో ఎమర్జెన్సీ స్టాప్​ సిగ్నల్​ ఉండనున్నాయి. ఆటోమెటిక్​ టర్న్​ సిగ్నల్​ కాన్సెలింగ్​ ఫంక్షన్​ కూడా ఉంటుంది. ఇక బైక్‌ రోజ్​ వైట్​, మాట్​ బాలిస్టిక్​ బ్లాక్​ రంగుల్లో వస్తుంది. హోండా ఎక్స్​ఎల్​750 ట్రాన్సల్ప్ ఎక్స్​షోరూం ధర రూ.10,99,990 కాగా.. ఇంట్రొడక్టరీ ధర కాగా.. తొలి వందమంది కస్టమర్లకు మాత్రమే ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉండనున్నది. ఆ తర్వాత మోడల్‌ ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఇక బైక్‌కు సంబంధించి అడ్వాన్స్‌ బుకింగ్‌ మొదలయ్యాయి. బిగ్​వింగ్​ డీలర్​షిప్స్​ ద్వారా ఈ హోండా ఎక్స్​ఎల్​750 ట్రాన్సల్ప్​ని హోండా కంపెనీ విక్రయిస్తున్నది. హైదరాబాద్‌తో పాటు గురుగ్రామ్​, ముంబ, బెంగళూరు, ఇండోర్​, కొచ్చి, చెన్నై, కోల్​కతాలోని షోరూమ్స్‌లో బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ నెలలోనే బైక్‌ డెలివరీలు మొదలవనున్నాయి.