స్వల్ప లాభాల్లో సూచీలు

విధాత,ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 68 పాయింట్ల లాభంతో 52,948 వద్ద.. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 15,860 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.32 వద్ద ట్రేడవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో అమెరికా మార్కెట్లకు సోమవారం సెలవు. ఆసియా మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్‌, […]

స్వల్ప లాభాల్లో సూచీలు

విధాత,ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 68 పాయింట్ల లాభంతో 52,948 వద్ద.. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 15,860 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.32 వద్ద ట్రేడవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో అమెరికా మార్కెట్లకు సోమవారం సెలవు.

ఆసియా మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్‌, టాటా స్టీల్‌, టైటన్‌, బజాజ్‌ ఆటో, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, పవర్‌ గ్రిడ్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.