IRCTC New Rules | యూజర్లకు షాక్ ఇచ్చిన ఐఆర్సీటీసీ.. ఇకపై అలా చేస్తే జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదు..!
IRCTC New Rules | రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేట్ (IRCTC) షాక్ ఇచ్చింది. ఇకపై ఐఆర్సీటీసీ పర్సనల్ ఐడీ నుంచి టికెట్ బుక్ చేసుకునే విషయంలో నిబంధనలను మార్చింది. ఆయా నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాతో పాటు జైలు శిక్షను సైతం ఎదుర్కోవాల్సి రానున్నది.

IRCTC New Rules | రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేట్ (IRCTC) షాక్ ఇచ్చింది. ఇకపై ఐఆర్సీటీసీ పర్సనల్ ఐడీ నుంచి టికెట్ బుక్ చేసుకునే విషయంలో నిబంధనలను మార్చింది. ఆయా నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాతో పాటు జైలు శిక్షను సైతం ఎదుర్కోవాల్సి రానున్నది. చాలా మంది రైలు ప్రయాణం సమయంలో ఐఆర్సీటీసీ పర్సనల్ ఐడీ ద్వారా రైలు బుక్ చేసుకునే విషయం అందరికీ తెలిసిందే.
అయితే, కొందరు ఇతరుల కోసం సైతం ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు ఐఆర్సీటీసీ కొత్తగా నిబంధనలను మార్చింది. ఇకపై కేవలం ప్రయాణికులు ఇతరులకు టికెట్లను బుక్ చేస్తే.. ఇండియన్ రైల్వే యాక్ట్ సెక్షన్ 143 ప్రకారం చట్టపరంగా నిబంధనను అతిక్రమణ కిందకు రానున్నది. మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల వరకు జరిమానా సైతం విధించే అవకాశం ఉన్నది. కేవలం పర్సనల్ ఐడి ద్వారా నుంచి తమ కుటుంబ సభ్యులు మాత్రమే రైలు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది.
ఇదిలా ఉండగా.. ఇక ఆధార్‌తో లింక్ చేసుకున్న ఐఆర్సీటీసీ యూజర్లు నెలకు 24 టికెట్లను బుక్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నది. ఆధార్ అనుసంధానం చేయని ప్రయాణికులకు 12 టికెట్లను బుక్ చేసుకునే వీలు కల్పిస్తుంది. ఇక ఇది కూడా యూజర్‌తో పాటు కుటుంబీకులకు మాత్రమే పరిమితం చేసింది. టికెట్ల రిజర్వేషన్లో దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు పారదర్శకత కోసం ఈ నిబంధనను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది.