New Rules From June | జూన్‌ నుంచి జరుగబోయే మార్పులు ఇవే..! ఈ రూల్స్‌ మారబోతున్నాయని తెలుసా..?

New Rules From June | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగుస్తున్నది. మే మాసం ముగిసి జూన్‌ నెల మొదలవనున్నది. ప్రతి కొత్త నెల ప్రారంభమైనప్పుడల్లా తొలి రోజు నుంచి అనేక ఆర్థిక నియమాలు మారుతూ వస్తుంటాయి. ఈ నిబంధనలు సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంటాయి.

New Rules From June | జూన్‌ నుంచి జరుగబోయే మార్పులు ఇవే..! ఈ రూల్స్‌ మారబోతున్నాయని తెలుసా..?

New Rules From June | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగుస్తున్నది. మే మాసం ముగిసి జూన్‌ నెల మొదలవనున్నది. ప్రతి కొత్త నెల ప్రారంభమైనప్పుడల్లా తొలి రోజు నుంచి అనేక ఆర్థిక నియమాలు మారుతూ వస్తుంటాయి. ఈ నిబంధనలు సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంటాయి. ఇలాంటి నేపథ్యంలో రోజువారీ జీవనంలో భాగంగా వీటి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. అయితే వచ్చే జూన్‌ నుంచి మారనున్న కొత్త నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

LPG సిలిండర్ ధర

చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ ధరలను ప్రతి నెల ఒకటో తేదీని ధరలు సవరిస్తూ వస్తుంటాయి. అయితే, చమురు కంపెనీలు మే నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్‌ సిలిండర్‌, వాణిజ్య సిలిండర్ల ధరలను సవరించనున్నాయి. అయితే, వాణిజ్య సిలిండర్ల ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, డిమెస్టిక్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కొనసాగుతున్న నేపథ్యంలో ధరల పెంపు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు కేంద్రం రూ.200 వరకు ధరను తగ్గించిన విషయం తెలిసిందే.

బ్యాంకులకు సెలవు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంక్ సెలవుల జాబితా ప్రకారం.. జూన్‌లో పది రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. ఇందులో ఆదివారం, రెండవ, నాల్గో శనివారం సెలవులు సైతం ఉన్నాయి. రాజా సంక్రాంతి, ఈద్-ఉల్-అధా తదితర సెలవులతో జూన్‌లో బ్యాంక్ వేయనున్నారు. ఈ పరిస్థితిలో బ్యాంకుకు వెళ్లే ముందు ఖచ్చితంగా ఏ రోజు సెలవులు ఉన్నాయో చూసుకోవడం బెటర్‌.

ట్రాఫిక్ నిబంధనలలో మార్పులు

జూన్ 1 నుంచి ట్రాఫిక్ నిబంధనలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నియమాలు జూన్‌ నుంచి అమలులోకి రానున్నాయి. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. కొత్త నిబంధన ప్రకారం అతి వేగంతో వాహనం నడిపితే రూ.1000 నుంచి రూ.2వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.అదే సమయంలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా విధిస్తారు. హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ముగియనున్న ఆధార్‌ అప్‌డేట్‌ గడువు

జూన్‌లో ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు ముగియనున్నది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆధార్‌ను మార్చుకునేందుకు ఉడాయ్‌ ఉచితంగా అవకాశం కల్పించింది. ఈ గడువు జూన్‌ 14న ముగియనున్నది. ఇంతకు ముందు మార్చి 14న గడువు ముగియగా.. మరో రెండు నెలలు పొడిగించింది. గడువు ముగిసిన తర్వాత రూ.50 చెల్లించాల్సి రానున్నది. ఎవరైనా ఇంకా ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోలేకపోతే.. ఇప్పుడే వేగంగా పూర్తి చేసుకోండి మరి.

అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ అమెజాన్‌ పే క్రెడిట్‌కార్డు రూల్స్‌ని మార్చింది. కొత్త రూల్స్‌ జూన్‌ 18 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కార్డ్‌తో అద్దె చెల్లింపుపై ప్రస్తుతం ఒకశాతం రివార్డ్‌ పాయింట్‌ పాయింట్‌ ఇస్తున్నది. ఇకపై రివార్డ్‌ పాయింట్స్‌ను ఎత్తివేయబోతున్నది. అద్దె చెల్లింపుల ద్వారా ఎలాంటి రివార్డు పాయింట్లు రాబోవన్నమాట. ఇక క్రెడిట్‌కార్డు హోల్డర్స్ పెట్రోల్‌, డీజిల్‌ పోయించే సమయంలో ఈ కార్డును ఉపయోగిస్తే ప్రతిసారీ సర్‌చార్జీ చెల్లింపుపై ఒకశాతం తగ్గింపు పొందనున్నారు. ఈ కార్డ్‌పై రివార్డ్‌లపై ఎలాంటి పరిమితి ఉండదు.