Credit Card Payment | ఇకపై అలా క్రెడిట్‌కార్డుల బిల్లుల చెల్లింపు కుదరదు..!

Credit Card Payment | భారతీయ రిజర్వ్‌ బ్యాంకు క్రెడిట్‌కార్డు బిల్లుల చెల్లింపులో కొత్తగా పలు కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ రూల్స్ నెల నుంచి అమలులోకి వచ్చాయి. క్రెడిట్‌కార్డు బిల్లులను కేవలం భారత్ పేమెంట్ సిస్టమ్ నుంచి చెల్లించాల్సి రానున్నది.

Credit Card Payment | ఇకపై అలా క్రెడిట్‌కార్డుల బిల్లుల చెల్లింపు కుదరదు..!

Credit Card Payment | భారతీయ రిజర్వ్‌ బ్యాంకు క్రెడిట్‌కార్డు బిల్లుల చెల్లింపులో కొత్తగా పలు కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ రూల్స్ నెల నుంచి అమలులోకి వచ్చాయి. క్రెడిట్‌కార్డు బిల్లులను కేవలం భారత్ పేమెంట్ సిస్టమ్ నుంచి చెల్లించాల్సి రానున్నది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు పలు బ్యాంకుల క్రెడిట్‌కార్డుల వినియోగదారులు ఇప్పటి వరకు బిల్లులను థర్డ్‌పార్టీ అప్లికేషన్స్‌ గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్‌పే, పేటీఎం యాప్స్‌ ద్వారా చెల్లివస్తూ వచ్చారు. కానీ, ఇకపై అలా కుదరదు. భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌ను ఆర్‌బీఐ దీన్ని అభివృద్ధి చేసింది. వ్యాపారాలావాదేవీల్లో చెల్లింపు వ్యవస్థను మరింత సరళీకృతం చేసేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఎస్‌బీఐ, బీఓబీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో పాటు మరికొన్ని బ్యాంకులు చేరాయి.

ఆయా బ్యాంకులు మళ్లీ కొత్తగా చేరాల్సిన అవసరం లేదు. జూలై ఒకటి నాటికి భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థతో ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సరస్వత్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్‌లు త్వరలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌లో చేరాల్సి ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డ్‌ వినియోగదారులు ఎలా చెల్లింపులు చేస్తున్నారో ఆ సంస్థ, బ్యాంక్.. బీబీపీఎస్‌తో లింక్‌ అయ్యిందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారం ఆయా బ్యాంకుల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నది.