RBI | ఇంగ్లండ్‌ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం..! ఆర్‌బీఐ అంత బంగారాన్ని ఎందుకు తెచ్చింది..?

RBI | ఇంగ్లండ్‌ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరలించింది. నిల్వల సర్దుబాటులో భాగంగా ఆర్‌బీసీ ఈ బంగారాన్ని భారత్‌కు తీసుకువచ్చింది. అయితే, ఈ లక్షల బంగారాన్ని తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని పంపి.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించింది.

RBI | ఇంగ్లండ్‌ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం..! ఆర్‌బీఐ అంత బంగారాన్ని ఎందుకు తెచ్చింది..?

RBI | ఇంగ్లండ్‌ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరలించింది. నిల్వల సర్దుబాటులో భాగంగా ఆర్‌బీసీ ఈ బంగారాన్ని భారత్‌కు తీసుకువచ్చింది. అయితే, ఈ లక్షల బంగారాన్ని తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని పంపి.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించడం ఆషామాషీ ఏం కాదు. వాస్తవానికి గత కొద్ది సంవత్సరాలుగా రిజర్వ్‌ బ్యాంక్‌ భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నది. ఈ ఏడాది మార్చి నాటికి రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద 822.1 టన్నలు బంగారం నిల్వ ఉన్నది. ఇందులో 413.8 టన్నుల బంగారాన్ని విదేశాల్లోనే నిల్వ చేసింది.

ఆర్‌బీఐ ముంబయిలోని మింట్‌ కాంపౌండ్‌, నాగ్‌పూర్‌లోని పాత రిజర్వ్‌ బ్యాంక్‌ కార్యాలయంలో బంగారాన్ని నిల్వ చేస్తుంటుంది. ఇటీవల ఆర్‌బీఐ పసిడి కొనుగోళ్లను పెంచుతూ వచ్చింది. ఈ క్రమంలో వంద టన్నుల బంగారాన్ని ఇంగ్లండ్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో నిల్వ చేసింది. చాలా దేశాలకు చెందిన సెంట్రల్‌ బ్యాంకులు బ్యాంక్‌ ఇంగ్లండ్‌లో పెద్ద ఎత్తున బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. ఇందుకు ఆ బ్యాంకు ఫీజును సైతం చెల్లిస్తుంటాయి. తాజాగా రిజర్వ్‌ బ్యాంకు ఇంగ్లండ్‌ బ్యాంకులో నిల్వ చేసిన బంగారాన్ని భారత్‌కు తరలించింది.

గత 15 సంవత్సరాల కింద అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి ఆర్‌బీఐ 200 టన్నుల బంగారం కొన్నది. దాంతో పాటు కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేస్తున్న ఆర్‌బీఐ.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో నిల్వ చేసింది. 2024 మార్చి నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. ఇందులో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది. 2023లో 27.5 టన్నుల పసిడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌ వ్యవధిలోనే నిరుడు కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా పసిడిని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది. లక్షల కిలోల బంగారాన్ని ఇంగ్లండ్‌ నుంచి తరలించేందుకు కొద్ది నెలలుగా కసరత్తు చేసిన ఆర్‌బీఐ.. ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకువచ్చింది.

విదేశీ మారక నిల్వల పరంగా నెలకొన్న సంక్షోభం కారణంగా 1991లో ఆర్బీఐ పెద్ద ఎత్తున బంగారాన్ని తనఖా పెట్టింది. ప్రస్తుతం ఈ విషయాన్ని గుర్తు చేసిన ఆర్‌బీఐ వర్గాలు.. ‘ఆర్థికంగా భారత్‌ సామర్థ్యం, విశ్వాసం ఏ స్థాయిలో ఉందనేది స్వదేశీ ఖజానాకు ఇంత పెద్దఎత్తున బంగారాన్ని చేర్చడమే చాటుతోంది’ వ్యాఖ్యానించాయి. ‘కొన్నేళ్ల కిందటి నుంచి ఆర్‌బీఐ బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించిందని.. దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చిందని.. విదేశాల్లో నిల్వలు పెరిగిపోవడంతో సర్దుబాట్లలో భాగంగా కొన్ని నిల్వలలను భారత్‌కు తరలించాలని నిర్ణయించాం’ ఆర్‌బీఐ వర్గాలు వివరించాయి.