RBI MPC | యథావిధిగా రెపోరేటు.. 6.5శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించామన్న శక్తికాంత దాస్‌

RBI MPC | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశం తర్వాత రెపో రేటును యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. రెపోరేటును ప్రస్తుతం ఉన్న 6.5శాతం వద్దనే కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శాంతికాంత దాస్‌ గురువారం ప్రకటించారు.

RBI MPC | యథావిధిగా రెపోరేటు.. 6.5శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించామన్న శక్తికాంత దాస్‌

RBI MPC | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశం తర్వాత రెపో రేటును యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. రెపోరేటును ప్రస్తుతం ఉన్న 6.5శాతం వద్దనే కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శాంతికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. ఈ నెల 6 నుంచి 8 వరకు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరిగాయి. సమావేశంలో 4:2 మెజారిటీతో పాలసీ వడ్డీ రేట్లను అనగా రెపోరేటును 6.5శాతం యథాతధంగా కొనసాగించాలని కమిటీ నిర్ణయించిందన్నారు. గతేడాది ఫిబ్రవరి నుంచి రెపోరేటులో ఆర్‌బీఐ మార్పులు చేయకపోవడం గమనార్హం. ఎంసీపీ వరుసగా తొమ్మిదో సమావేశంలోనూ రెపోరేటును 6.5శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయంతో రుణాలకు సంబంధించి ఈఎంఐలపై సామాన్యులకు ఎలాంటి ఉపశమనం ఉండదని ఆర్థిక పండితులు పేర్కొంటున్నారు.

ఎంసీపీ నిర్ణయాలపై గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పందిస్తూ.. ప్రపంచస్థాయిలో అస్థిరత కనిపిస్తోందని చెప్పారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుతోందన్నారు. ‘కేంద్ర బ్యాంకులు ఆర్థిక స్థితిని బట్టి వడ్డీ రేట్లపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంది. సర్వీస్‌ సెక్టార్‌ పనితీరు గణనీయంగా మెరుగుపడింది. సేవా రంగం, నిర్మాణ రంగం బలంగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.2శాతం వద్దే ఉంటుంది’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల అనంతరం ఆహార ద్రవోల్బణం దిగివస్తుందని ఎంసీపీ ఆశాభావం వ్యక్తం చేసింది. 2024-25లో ద్రవ్యోల్బణం 4.5శాతం ఉండగా ఉండవచ్చని అంచనా. జూన్‌లో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ చివరి సమావేశంలో ఎంపీసీలోని ఆరుగురిలో నలుగురు సభ్యులు రెపో రేటును యథాతథంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఓటు వేశారు. పాలసీ రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల కోతతో పాటు మార్పులు చేయాలంటూ జయంత్ వర్మ, అషిమా గోయల్ ఓటు వేశారు.