Jio Recharge Plan | యూజర్లకు అదిరిపోయే ఆఫర్‌ ఇస్తున్న జియో..! ఈ రీఛార్జ్‌ ప్లాన్స్‌తో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌..!

Jio Recharge Plan | దేశంలో అతిపెద్ద ప్రైవేటు టెలికాం సంస్థ అయిన జియో తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఇటీవల కొత్త కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తున్నది. గత జూలైలో భారీగా పెరిగిన రీఛార్జి టారిఫ్‌లతో యూజర్ల మిగతా నెట్‌వర్క్‌లకు మారిపోతున్నారు. దీంతో అప్రత్తమైన జియో.. సరికొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తున్నది.

Jio Recharge Plan | యూజర్లకు అదిరిపోయే ఆఫర్‌ ఇస్తున్న జియో..! ఈ రీఛార్జ్‌ ప్లాన్స్‌తో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌..!

Jio Recharge Plan | దేశంలో అతిపెద్ద ప్రైవేటు టెలికాం సంస్థ అయిన జియో తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఇటీవల కొత్త కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తున్నది. గత జూలైలో భారీగా పెరిగిన రీఛార్జి టారిఫ్‌లతో యూజర్ల మిగతా నెట్‌వర్క్‌లకు మారిపోతున్నారు. దీంతో అప్రత్తమైన జియో.. సరికొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తున్నది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా ఆఫర్ చేస్తున్నది. ఉన్న యూజర్లు ఇతర నెట్‌వర్క్‌ల వైపు మొగ్గు చూపకుండా ఆకర్షణీయమైన ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. పలు రీఛార్జ్‌ ప్లాన్స్‌పై ఈ అవకాశం ఇస్తున్నది. రూ.3999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

ఇందులో ప్రతిరోజూ 2.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. 5జీ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5జీ సేవలు పొందే వీలుంటుంది. 365 రోజులకు కలిపి 912.5 జీబీ డేటా లభిస్తుంది. జియో సినిమా ఓటీటీ సేవలతో పాటు జియో టీవీ, జియో క్లౌడ్ సైతం ఫ్రీగా వస్తాయి. ఇక రూ.949 రీఛార్జ్ ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. అన్‌లిమిటెడ్ 5జీ సేవలు పొందేవీలుంటుంది. 90 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా వాడుకోవచ్చు. అలాగే, రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు అదనంగా లభిస్తాయి. ఇక మరో రూ.1029 రీఛార్జ్ ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా.. రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. మరో రూ.1049 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. అలాగే, రోజుకు 2 జీబీ డేటా రానుండగా.. అన్‌లిమిటెడ్‌ 5జీ సేవలు పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉండగా.. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు అదనంగా వాడుకోవచ్చు. అలాగే, సోనీ లివ్, జీ5 సేవలు ఫ్రీగా వాడుకోవచ్చు. రూ.1299 రీఛార్జ్ ప్లాన్‌లో 84 రోజు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సౌకర్యం ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సర్వీసెస్‌ అదనం. ఇక నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ఉచితంగా ఇస్తున్నది.