Actress Laya | ‘స్వయంవరం’ సెట్స్‌కు వెళ్లగానే దాన్ని చూడగానే విసుగు వచ్చేది..!

Actress Laya | తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు ఉన్నది తక్కువే. సినిమాల్లోకి పలువురు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినా వారంతా నిలదిక్కుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇదే క్రమంలో తెలుగు అమ్మాయి లయ సైతం చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Actress Laya | ‘స్వయంవరం’ సెట్స్‌కు వెళ్లగానే దాన్ని చూడగానే విసుగు వచ్చేది..!

Actress Laya | తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు ఉన్నది తక్కువే. సినిమాల్లోకి పలువురు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినా వారంతా నిలదిక్కుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇదే క్రమంలో తెలుగు అమ్మాయి లయ సైతం చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వేణు తొట్టెంపుడి హీరోగా విజయభాస్క్‌ దర్శకత్వంలో వచ్చిన ‘స్వయంవరం’ చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఈ చిత్రం సిల్వర్‌జూబ్లీని పూర్తి చేసుందుకుంది. ఈ సందర్భంగా లయ ‘మహామ్యాక్స్‌’ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా సినిమాల్లోకి ఎంట్రీకి సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గతంలో ‘స్టార్ 2000’ అనే కాంటెస్ట్‌ని నిర్వహించారని.. ఆ కంటెంట్స్‌లో ఫస్ట్‌ వచ్చిన వారిని ఆయన ‘పరదేశి’ సినిమా కోసం తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ కాంటెస్ట్‌లో తాను రెండోస్థానంలో వచ్చానని లయ తెలిపింది. దాంతో తనకు సినిమాలు అవకాశాలు వస్తుండేవని తెలిపింది. ఫస్ట్‌ ప్లేస్‌లో రానందుకు బాధపడలేదని.. ఆ సమయంలో తాను సినిమాల్లోకి రావాలని అంత సీనియర్‌గా అనుకోలేదని తెలిపింది. ఎందుకంటే ఆ సమయంలో పదో తరగతి చదువుతున్నట్లు చెప్పారు. కాంటెస్ట్‌లో సెకండ్‌ రావడంతో చాలా మంది తమ సినిమాల కోసం అడుగుతూ ఉండేవారని.. అలా తనకు వచ్చిన సినిమాల్లో ‘స్వయంవరం’ ఒకటని గుర్తు చేసుకున్నారు. హీరో వేణు ఆరు అడుగులకుపైనే ఉండేవారని.. ఆయన హైట్‌తో తనను మ్యాచ్ చేయవలసి వచ్చేదని.. అందుకోసం సైజుల వారీగా స్టూల్స్ తెప్పించేవారని చెప్పింది.

తనను స్టూల్ ఎక్కించేవారని గుర్తు చేసుకుంది. సెట్స్‌కి వెళ్లిన సమయంలో వెళ్లగానే స్టూల్ కనిపించగానే ‘అబ్బా’ అంటూ నాకు విసుగు వచ్చేదని.. షూటింగ్‌ పూర్తయ్యాక హమ్మయ్యా ఇక స్టూల్ బాధ తప్పింది అనుకున్నాను’ అంటూ లయ నవ్వేసింది. అయితే, మొదట ఈ చిత్రానికి వేరే అమ్మాయిని తీసుకోవాలని అనుకున్నారని.. కానీ తనని చూసిన తర్వాత అవకాశం ఇచ్చినట్లు వివరించింది. లయ 2006 గణేశ్‌ గోర్టీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. లయ దంపతులకు కుమార్తె, కొడుకు ఉన్నారు. ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.