Pawan Kalyan| ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపుతో ఆ సెల‌బ్రిటీల‌కి మ‌డ‌త‌డిపోతుందిగా..!

Pawan Kalyan| ఏపీలో కూట‌మి అఖండ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇంత భారీ విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణం ప‌వ‌న్ అని అంద‌రు అంటున్నారు. అత‌ను వైసీపీ ఓటు చీల‌నివ్వ‌కుండా కూట‌మిగా ఏర్ప‌డి ఇంత భారీ విజ‌యం ద‌క్కేలా చేశారు. జనసేన 21 స్థానాలకి గాను 21 కూడా గెలిచి అద‌ర‌గొట్టింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ ఈ సారి తుడిచిపెట్టుకుపోతుందని, ఆయ‌న ఈ సారి గెల‌వ‌డం క‌ష్ట‌మే అని చాలా మంది చాలా ర‌కాలుగా విమ‌ర్శించారు. కాని వారంద‌రికి

  • By: sn    cinema    Jun 05, 2024 8:30 AM IST
Pawan Kalyan| ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపుతో ఆ సెల‌బ్రిటీల‌కి మ‌డ‌త‌డిపోతుందిగా..!

Pawan Kalyan| ఏపీలో కూట‌మి అఖండ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇంత భారీ విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణం ప‌వ‌న్ అని అంద‌రు అంటున్నారు. అత‌ను వైసీపీ ఓటు చీల‌నివ్వ‌కుండా కూట‌మిగా ఏర్ప‌డి ఇంత భారీ విజ‌యం ద‌క్కేలా చేశారు. జనసేన 21 స్థానాలకి గాను 21 కూడా గెలిచి అద‌ర‌గొట్టింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ ఈ సారి తుడిచిపెట్టుకుపోతుందని, ఆయ‌న ఈ సారి గెల‌వ‌డం క‌ష్ట‌మే అని చాలా మంది చాలా ర‌కాలుగా విమ‌ర్శించారు. కాని వారంద‌రికి ఈ రిజ‌ల్ట్‌తోనే బాగా బుద్దిచెప్పిన‌ట్టైంది. అయితే ప‌వ‌న్‌ని ఇన్నాళ్లు విమ‌ర్శించిన వారు ఇప్పుడు ట్రోలింగ్ తాకిడికి త‌ట్టుకోలేక‌పోతున్నారు.యాంక‌ర్ శ్యామ‌ల ఇటీవ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారంలోను, అలానే రీసెంట్ ఇంట‌ర్వ్యూలోను పవన్ కళ్యాణ్ ఆవేశపడడం, ఆయాస పడడం తప్ప ఇతరులకు సహాయ పడడం తానెప్పుడూ చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఇక ప‌వ‌న్ గెలుపు ఖాయ‌మైన త‌ర్వాత బేబీ చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్ శ్యామలపై సెటైరికల్ గా కౌంటర్ వేసారు. నితిన్ అ..ఆ.. చిత్రంలోని ఎళ్ళిపోకే శ్యామల, ఏమి బాగాలేదు అంటూ పాటని షేర్ చేసాడు. ఇక మిగ‌తావారైతే ఆమెని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. అలానే పోసాని కృష్ణ ముర‌ళిని కూడా తెగ తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు ఎక్క‌డ‌కిపోయావు, ఎక్క‌డ దాక్కున్నావు అంటూ ఫైర్ అవుతున్నారు. మ‌రోవైపు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్షించే రామ్ గోపాల్ వర్మ.. ఈ భారీ గెలుపుతో ఎలా స్పందిస్తారు అని అంతా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో ఆయన చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పవ‌న్ క‌ళ్యాణ్ పేరు రాసి.. దండం సింబల్స్ పెట్టేశారు.. నువ్వు నిజంగా గొప్పోడి స్వామి అన్నట్టుగా దండం పెడుతున్న గుర్తులను పోస్ట్ చేశాడు. దీనిపై జ‌న‌సైనికులు ఇప్పుడు అర్ధ‌మైందా మా ప‌వ‌న్ అన్న అంటే ఏంటో అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ త‌న స్నేహితుడు శిల్ప రవిచంద్ర రెడ్డి కోసం నంద్యాల వెళ్లి ప్ర‌చారం చేశారు. ప‌వ‌న్‌కి స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు చిన్న ట్వీట్ వేసిన బ‌న్నీ శిల్ప ర‌విచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లి మ‌రీ ప్ర‌చారం చేశారు.అయితే బ‌న్నీ ప్ర‌చారం ఆయ‌న స్నేహితుడికి ఉపయోగం కాలేదు. అయితే ఇలాంటి స‌మయంలో రెండో సారి మళ్ళీ తప్పు పునరావృతం కాకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి గెలిచారు అని ప్రకటన వెలువడిన కొన్ని నిముషాలకే పవన్ కళ్యాణ్ ని అభినందిస్తూ ‘ఎక్స్’ లో ఆలస్యం కాకుండా పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్.దీనిపై కూడా కొంద‌రు నెటిజ‌న్స్ అల్లు అర్జున్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు.