Akira nandan| పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన అకీరా..జూనియర్ పవర్ స్టార్ అంటూ కామెంట్స్
Akhira| ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఇటు సినీ ప్రముఖులు అటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి వంగా గీతాపై పవన్ కళ్యాణ్ పోటీ చేయగా,

Akhira| ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఇటు సినీ ప్రముఖులు అటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి వంగా గీతాపై పవన్ కళ్యాణ్ పోటీ చేయగా, ఆయన అరవై తొమ్మిది వేల(69 వేలు) ఓట్ల తేడాతో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఫలితాల అనంతరం పవన్ కళ్యాణ్ మంగళగిరికి వెళ్లారు. అయితే పవన్ ఇంటి నుండి బయలుదేరే ముందు ఆయన భార్య అన్నా లెజ్నెవా విజయతిలకం దిద్దారు. ఇందుకు సంబంధించిన వీడియోని జనసేన పార్టీ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. అయితే వీడియోలో పవన్ కుమారుడు అకిరా నందన్ కూడా కనిపించాడు.
ఇక పవన్ కోసం వచ్చిన అభిమానులకి అకీరానందన్ అభివాదం చేయగా, అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి. ఇక కూటమి భారీ విజయం సాధించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా జనసేన ఆఫీసుకి వెళ్లి పవన్ కళ్యాణ్‌ని కలిసారు. చంద్రబాబు రాకతో పవన్ దిల్ ఖుష్ అయ్యారు. ఇక అక్కడే ఉన్న తన కుమారుడు అకీరాను చంద్రబాబుకి పరిచయం చేశారు పవన్ కళ్యాణ్ . అంతేకాకుండా బాబుగారి కాళ్లకు నమస్కారం చేయాల్సిందిగా అకీరాకు సూచించారు పవర్ స్టార్. దాంతో వెంటనే అకీరా చంద్రబాబు ఆశీస్సులు అందుకున్నారు. అయితే చాలా రోజుల తర్వాత అకీరా ఇలా కనిపించడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ థ్రిల్ అవుతున్నారు.
జూనియర్ పవర్ స్టార్ అదిరిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు.. గంటకి పైగా పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల అనంతరం బాబుకు దగ్గరుండి కారుదాకా వచ్చి పంపించారు పవన్. ఇక ఈ ఎన్నికలలో జనసేన వందకి వందశాతం రిజల్ట్ అందుకుంది. గెలిచింది 21 సీట్లు అయినా.. 175 మంది బాధ్యత తమపై ఉంది అన్నారు పవర్. కక్ష్యసాధింపులు ఉండవని.. జగన్ పై తనకు కోపం లేదన్నారు. రాష్ట్రంలో చీకటి రోజులు పోయాయని అంతా మంచే జరుగుతుంది అన్నారు పవన్.