Amy Jackson|ఒకరితో బిడ్డ‌ని క‌ని ఇప్పుడు మ‌రొక‌రితో పెళ్లికి రెడీ అవుతున్న అమీ జాక్స‌న్.. ఆ ముద్దులేందో..!

Amy Jackson| అమీ జాక్స‌న్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు..బ్రిటిష్ - ఇండియన్ అయిన ఈ భామ‌ తమిళ సినిమాల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది.. మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2.. లాంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీ

  • By: sn    cinema    Aug 24, 2024 8:10 AM IST
Amy Jackson|ఒకరితో బిడ్డ‌ని క‌ని ఇప్పుడు మ‌రొక‌రితో పెళ్లికి రెడీ అవుతున్న అమీ జాక్స‌న్.. ఆ ముద్దులేందో..!

Amy Jackson| అమీ జాక్స‌న్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు..బ్రిటిష్ – ఇండియన్ అయిన ఈ భామ‌ తమిళ సినిమాల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది.. మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2.. లాంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పిక్ టైంలోనే ఇంగ్లాండ్‌కి చెందిన జార్జ్ అనే ఓ వ్యక్తితో ప్రేమాయణం న‌డిపిన ఈ ముద్దుగుమ్మ అత‌నితో కొన్నాళ్ల‌పాటు లివింగ్ రిలేష‌న్ మెయింటైన్ చేసింది. ఆ క్ర‌మంలో ఓ బిడ్డ‌ని కూడా క‌నింది. పెళ్లిపీట‌లెక్క‌కుండానే వీరి బంధానికి ముగింపు ప‌డింది. 2022లో ప‌న‌యోట్టుతో త‌న బంధం ముగిసిన‌ట్లుగా అమీజాక్స‌న్ ప్ర‌క‌టించింది.

అత‌డితో స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు, జ్ఞాప‌కాల్ని త‌న సోష‌ల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేసి ఆ త‌ర్వాత వెస్ట్‌విక్‌తో ప్రేమ‌లో ప‌డింది. ఆస్కార్ విన్న‌ర్ ఆల్ఫాన్సో క్యురాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిల్డ్ర‌న్ ఆఫ్ మెన్ సినిమాతో వెస్ట్‌విక్ న‌టుడిగా మారాడు. బ్రేకింగ్ అండ్ ఎంట‌రింగ్‌, రోమియో అండ్ జూలియ‌ట్‌తో పాటు హాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేశాడు. అమెరిక‌న్ వెబ్ సిరీస్ గాసిప్ గ‌ర్ల్ న‌టుడిగా వెస్ట్‌విక్‌కు ఎన‌లేని పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం అత‌డితో చెట్టాప‌ట్టాలు వేసుకుంటూ తిరుగుతుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ‘లెట్స్ గెట్ మ్యారీడ్ బేబీ’ అని అమీ జాక్సన్ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది అమీ జాక్సన్. ఈ ఏడాది జనవరిలో అమీకి ఎడ్ ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. ఇటలీకి ప్రయివేట్ జెట్ లో అమీ జాక్సన్, ఎడ్ కలిసి వెళ్లారు. ఈ ఫొటోలో అమీ కుమారుడిని కూడా చూడొచ్చు.

ఇటీవలే తన కొత్త ప్రియుడుతో ఎంగేజ్మెంట్ తతంగాన్ని కూడా కానిచ్చేసింది. ఇక ఈ ఇద్ద‌రు క‌లిసి తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. కొడుకుని ప‌క్క‌న పెట్టుకొనే ఈ జంట ముద్దుల్లో మునిగిపోతున్నారు. కొంద‌రు వీరు చేసే ప‌నుల‌ని తెగ తిట్టిపోస్తున్నారు. అమీ జాక్స‌న్ ప్ర‌స్తుతం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. అప్పుడ‌ప్పుడు బాలీవుడ్ సినిమాల‌లో సంద‌డి చేస్తూ వ‌స్తుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో త‌న హాట్ అందాల‌తో కేక పెట్టిస్తుంది.