Anasuya| విజయ్ దేవరకొండతో వివాదంపై స్పందించిన అనసూయ.. పద్దతిగా ఉండాలంటూ కామెంట్
Anasuya| అందాల అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్ నుంచి యాక్టర్‌గా మారిన అనసూయ భరద్వాజ్ తెలుగు తెర మీద భావోద్వే

Anasuya| అందాల అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్ నుంచి యాక్టర్‌గా మారిన అనసూయ భరద్వాజ్ తెలుగు తెర మీద భావోద్వేగమైన, భారమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. రంగమ్మత్త పాత్ర తర్వాత ఈ అమ్మడు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది.అయితే అనసూయ కెరీర్ మొదట్లో కొంత గ్లామర్, హై రేంజ్‌లో స్కిన్ షో పాత్రలతో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత పుష్ప, విమానం లాంటి సినిమాల్లో ప్రేక్షకులను ఉద్వేగాలకు గురిచేసే పాత్రలో కనిపించి నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది.
ఇక అనసూయ ప్రధాన పాత్రలో సింబా అనే సినిమా రూపొందుతుంది. తాజాగా బుధవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో `మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు మేడం` అంటూ అనసూయ స్కూటీ తుడుస్తుంటాడు ఓవ్యక్తి. ఆ డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ కాగా, దీనిపై చాలా మంది తమదైన స్టైల్‌లో ప్రశ్నలు వేస్తున్నారు. ఓ రిపోర్టర్ …విజయ్‌కి మీకు మధ్య ఉన్న గొడవలు సమసిపోయినట్లేనా అని అడగగా, దానికి స్పందించిన అనసూయ ఇప్పుడు దానికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదని పేర్కొంది. అంతేకాదు సినిమాల ద్వారా ఎలాగైతే మెసేజ్‌లు ఇస్తారో నేను కూడా అలాగే మెసేజ్ ఇవ్వాలని రియాక్ట్ అయ్యాను.
ఆ రోజు నేను స్టేజ్‌పై ఎలా ఉండాలనే దాని గురించే మాట్లాడాను. మనం లైమ్ లైట్‌లో ఉన్నప్పుడుకాస్త పద్దతిగా ఉండాలి. మితిమీరిందనే విషయం అందరికి అర్ధమైతే బాగుండదు. అప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడకపోయే సరికి నేను మాట్లాడాల్సి వచ్చింది. మీడియా కూడా ప్రశ్నించలేదు.ఆ తర్వాత తప్పును ఎత్తుచూపించినందుకు నన్నే అందరూ తప్పుపట్టారు అని అనసూయ స్పష్టం చేసింది. ఇక ఆ ఇష్యూ నుండి నేను చాలా నేర్చుకున్నానంటూ అనసూయ తెలియజేసింది. ఆ సమయంలో నేను ఎవరిని కించపరచలేదు. నాకు ఎవరిపై ద్వేషం లేదు అంటూ అనసూయ పేర్కొంది. ఇప్పుడు అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.