Anushka Shetty| అనుష్క ఇంట పెళ్లి ప‌నులు షురూ.. చివ‌రికి అతనిని వివాహం చేసుకోబోతున్నజేజ‌మ్మ‌..!

Anushka Shetty|  అనుష్క శెట్టి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్టార్ హీరోల‌ని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ అమ్మ‌డి సొంతం. అక్కినేని నాగార్జున నటించిన 'సూపర్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఇందులో త‌న అందం,అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ని క‌ట్టి ప‌డేసింది. ఆ త‌ర్వాత మరిన్ని ఆఫ‌ర్స్ అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు చేసింది. కొన్ని క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు, మ‌రి కొన్ని

  • By: sn    cinema    Jul 25, 2024 7:53 PM IST
Anushka Shetty| అనుష్క ఇంట పెళ్లి ప‌నులు షురూ.. చివ‌రికి అతనిని వివాహం చేసుకోబోతున్నజేజ‌మ్మ‌..!

Anushka Shetty|  అనుష్క శెట్టి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్టార్ హీరోల‌ని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ అమ్మ‌డి సొంతం. అక్కినేని నాగార్జున నటించిన ‘సూపర్’ అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఇందులో త‌న అందం,అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ని క‌ట్టి ప‌డేసింది. ఆ త‌ర్వాత మరిన్ని ఆఫ‌ర్స్ అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు చేసింది. కొన్ని క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు, మ‌రి కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. అరుంధ‌తి చిత్రంలో జేజెమ్మ‌గా న‌టించి క‌ట్టిప‌డేసింది. ‘బాహుబలి’తో ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీ అందిపుచ్చుకుంది. అయితే ఇటీవలి కాలంలో అనుష్క సినిమాల సంఖ్య త‌గ్గించింది.

‘సైజ్ జీరో’ అనే సినిమాలో నటించిన అనుష్క‌గా ఇందులో లావు ఉన్న అమ్మాయిగా కనిపించేందుకు భారీగా బరువు పెరిగింది. అప్పటి నుంచి అనుష్కకు ఆరోగ్య సమస్యలు తలెత్త‌డంతో స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేస్తుంది. చివ‌రిగా మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి అనే సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ‘ఘాటి’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే అనుష్క పెళ్లి గురించి కొన్నాళ్లుగా నెట్టింట అనేక రూమ‌ర్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తున్నాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రేమాయణం సాగిస్తుందని, త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ తెగ ప్ర‌చారాలు సాగాయి. వాటిని ఈ ఇద్దరు కొట్టి పారేసారు.

అనుష్క ఓ నిర్మాతను వివాహం చేసుకోబోతుందంటూ ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. అనుష్క ఓ బిజినెస్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింద‌ని, ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిని అనుష్క ఫ్యామిలీ ఓకే చేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.అతను అనుష్కకు బాగా సెట్ అవుతాడని…. హ్యాండ్సమ్ గా ఉన్నాడని…. మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇక ఆ అబ్బాయితో వివాహానికి అనుష్క ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. కాని ఒప్పుకునే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు. మ‌రి చూడాలి ఈ వార్త అయిన నిజం అవుతుందా లేదా