Bigg Boss| ఇద్ద‌రు భార్య‌ల‌తో బిగ్ బాస్‌లోకి వెళ్లిన యూట్యూబ‌ర్.. ఇప్పుడు విడాకులు ఇస్తానంటున్న పెద్ద భార్య‌

Bigg Boss| బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మంకి అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. హిందీలో ఈ షో దూసుకెళుతుండ‌గా, ప్ర‌స్తుతం అనీల్ క‌పూర్ హోస్ట్‌గా ఓటీటీ షో న‌డుస్తుంది. అయితే ఈ సీజన్ లో ప్రముఖ యూట్యూబర్ అ

  • By: sn    cinema    Jul 22, 2024 6:48 AM IST
Bigg Boss| ఇద్ద‌రు భార్య‌ల‌తో బిగ్ బాస్‌లోకి వెళ్లిన యూట్యూబ‌ర్.. ఇప్పుడు విడాకులు ఇస్తానంటున్న పెద్ద భార్య‌

Bigg Boss| బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మంకి అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. హిందీలో ఈ షో దూసుకెళుతుండ‌గా, ప్ర‌స్తుతం అనీల్ క‌పూర్ హోస్ట్‌గా ఓటీటీ షో న‌డుస్తుంది. అయితే ఈ సీజన్ లో ప్రముఖ యూట్యూబర్ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో కలిసి బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్ల‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. హౌజ్‌లోకి వెళ్లేముందు ముగ్గురు క‌లిసి సంతోషంగా వెళ్ల‌గా, రీసెంట్‌గా పెద్ద భార్య ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చాక త‌న భ‌ర్త‌కి విడాకులు ఇస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

మొదటి వారమే అర్మాన్ భార్యల్లో ఒకరైన పాయల్ ఎలిమినేట్ కాగా, ఆమె బయటకి వచ్చిన దగ్గర్నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. తన భర్తకి గ‌తంలో ఓ సారి పెళ్లి జ‌రిగింద‌ని, ఆమెకి విడాకులు ఇచ్చాడని చెప్పింది.ఇప్పుడు నేను కూడా అత‌నికి విడాకులు ఇస్తానంటూ పాయ‌ల్ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షో తర్వాత తమ మీద విపరీతమైన నెగెటివ్ కామెంట్స్ వ‌చ్చాయ‌ని చెబుతున్న పాయ‌ల్ కొంద‌రు కృతిక‌, న‌న్ను లెస్బియన్స్ అంటూ కూడా ట్రోల్ చేశారు. నేను, కృతిక ఇద్దరం ఆర్మాన్ ని లవ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. నేను నా భర్తతో విడిపోవాలనుకుంటున్నాను. నిర్ణయం తీసేసుకున్నాను .నేను నా పిల్లలను తీసుకొని వెళ్తాను అంటూ పాయ‌ల్ చెప్పుకొచ్చింది.

కృతిక బాబు నా పిల్ల‌ల‌తో ఉండేందుకే ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తాడు.కావాలంటే అంద‌రు పిల్ల‌ల‌ని నేను పెంచుతాను. అప్పుడు ఆర్మాన్‌..కృతిక ఇద్ద‌రు సంతోషంగా ఉండ‌వ‌చ్చు అంటూ పాయ‌ల్ హాట్ హాట్ కామెంట్స్ చేసింది. అయితే ఆమె నిజంగానే విడాకులు ఇవ్వ‌బోతుందా? హౌజ్‌లో ఉన్న త‌న భ‌ర్త‌, కృతిక‌ల‌కి బిగ్ బాస్ హౌస్ లో రీచ్ పెంచడం కోసం చేసిన వ్యాఖ్యలా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. నిజంగా పాయ‌ల్ విడాకులు తీసుకుంటే మరో జంటను విడకొట్టిన క్రెడిట్ బిగ్ బాస్ ఖాతాలో ప‌డుతుంది. చూద్దాం మ‌రి ఏం జ‌రుగుతుందో..!