BIG UPDATE :’ఆచార్య’రెండు పాటలు పూర్తి

విధాత:మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య' సినిమా రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఇందులో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్. సోనూసూద్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి […]

BIG UPDATE :’ఆచార్య’రెండు పాటలు పూర్తి

విధాత:మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఇందులో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్. సోనూసూద్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలయిన ప్రచార చిత్రాలు, ‘లాహే లాహే’ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మేలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘ఆచార్య’ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఇటీవల మళ్ళీ సెట్స్ మీదకి వచ్చిన చిత్ర బృందం టాకీ పార్ట్‌ను కంప్లీట్ చేసింది. త్వరలోనే మిగిలిన రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారని సమాచారం. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ‘ఆచార్య’ కథ సాగుతుందని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై రాం చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.