Dhanush-Aishwarya|ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య విడాకులు ర‌ద్ద‌య్యాయా.. ఆ ఇద్ద‌రిని క‌లిపింది వారేనా?

Dhanush-Aishwarya|గ‌త కొంత కాలంగా సినిమా ఇండ‌స్ట్రీలో విడాకుల‌కి సంబంధించి అనేక వార్త‌లు మ‌నం వింటూ ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా క‌లిసి ఉన్న జంట‌లు కూడా ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకుంటున్నాయి. వారిలో ధనుష్‌,ఐశ్వ‌ర్య జంట ఒక‌టి. సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యతో ధనుష్

  • By: sn    cinema    Oct 18, 2024 10:36 AM IST
Dhanush-Aishwarya|ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య విడాకులు ర‌ద్ద‌య్యాయా.. ఆ ఇద్ద‌రిని క‌లిపింది వారేనా?

Dhanush-Aishwarya|గ‌త కొంత కాలంగా సినిమా ఇండ‌స్ట్రీలో విడాకుల‌కి సంబంధించి అనేక వార్త‌లు మ‌నం వింటూ ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా క‌లిసి ఉన్న జంట‌లు కూడా ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకుంటున్నాయి. వారిలో ధనుష్‌,ఐశ్వ‌ర్య జంట ఒక‌టి. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) పెద్ద కూతురు ఐశ్వర్యతో ధనుష్ వివాహం 2004 లో ఎంతో అట్ట‌హాసంగా జరిగింది. ఈ క్యూట్ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే దాదాపు 18 ఏళ్ల దాంపత్యం తరువాత ఈ జంట 2022 లో విడాకులు ప్రకటించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది..తాము ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా .. కలిసి ఉండడం కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలో ఎంతో అన్యోనంగా ఉండే జంట‌ల‌లో వారి జంట ఒక‌టి కాగా, వారు విడాకులు తీసుకుంటున్నార‌ని తెలిసి.. ఇటు ఫ్యాన్స్, అటు సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు.

విడాకుల ప్రకటన తర్వాత పల‌మార్తు వీరిద్దరు కలిసి కనిపించారు. అలాగే ఐశ్వర్య(Aishwarya) సినిమాకు సోషల్ మీడియా వేదికగా ధనుష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. వారిద్ద‌రు మ‌ళ్లీ క‌లుస్తారు అని చాలా మంది ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ధనుష్, ఐశ్వర్య విడాకుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నారట. రజనీకాంత్ ఆరోగ్యమే ఇందుకు కారణం అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ అనారోగ్యానికి కుటుంబ సమస్యలే కారణం అనే చర్చ జరుగుతున్న తరుణంలో, తండ్రి మనశ్శాంతి కోసం ఐశ్వర్య విడాకుల నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న‌ట్టు కోలీవుడ్ మీడియాలో జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది.

ఒక‌వైపు ర‌జ‌నీకాంత్ ఆరోగ్యం, మ‌రోవైపు ధ‌నుష్‌(Dhanush),ఐశ్వ‌ర్య పిల్లలు కూడా తల్లిదండ్రులు కలిసి ఉండాలని కోరుకుంటున్నారట. ఈ క్ర‌మంలో వారిద్ద‌రు మ‌ళ్లీ క‌లిసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని త్వ‌ర‌లోనే అంద‌రం ఆ గుడ్ న్యూస్ విన‌బోతున్నామ‌నే టాక్ గ‌ట్టిగా వినిపిస్తుంది. ఇటీవ‌ల రజనీకాంత్ కి ‘జైలర్’ సినిమాకి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, ఐశ్వర్య సినిమా థియేటర్ లోనే ధనుష్ చూశాడు. ఇవన్నీ చూస్తుంటే, మళ్ళీ కలిసి ఉండటానికి సిద్ధమైనట్టు టాక్ నడుస్తుంది. వీరి విడాకులు కేసు అక్టోబర్ 6న విచారణ జరిగింది. ధనుష్, ఐశ్వర్య కోర్టుకు హాజరు కాలేదు. దాంతో విచారణ అక్టోబర్ 19కి వాయిదా పడింది. మ‌రి రేపు ఏం జ‌ర‌గ‌నుంద‌ని అంతా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.