Nukaraju Asiya|ఇదెక్క‌డి ట్విస్ట్.. నూక‌రాజు, ఆసియా ల‌వ‌ర్స్ కాదా.. అన్నా చెల్లెళ్లా..!

Nukaraju Asiya| ఈ మధ్య కాలంలో సినిమా వాళ్లతో సమానంగానే బుల్లితెరపై న‌టించే వారు మంచి క్రేజ్ ద‌క్కించుకుంటున్నారు. ఎంతో మంది యువతీ యువకులు స్టార్‌డ‌మ్ సంపాదించారు. వారిలో యంగ్ క‌మెడీయ‌న్ నూక‌రాజు కూడా ఒక‌డు. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళుతూ

  • By: sn    cinema    Aug 16, 2024 7:48 AM IST
Nukaraju Asiya|ఇదెక్క‌డి ట్విస్ట్.. నూక‌రాజు, ఆసియా ల‌వ‌ర్స్ కాదా.. అన్నా చెల్లెళ్లా..!

Nukaraju Asiya| ఈ మధ్య కాలంలో సినిమా వాళ్లతో సమానంగానే బుల్లితెరపై న‌టించే వారు మంచి క్రేజ్ ద‌క్కించుకుంటున్నారు. ఎంతో మంది యువతీ యువకులు స్టార్‌డ‌మ్ సంపాదించారు. వారిలో యంగ్ క‌మెడీయ‌న్ నూక‌రాజు కూడా ఒక‌డు. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళుతూ అదే స‌మ‌యంలో ఆసియా అనే యువ‌తితో ఎంజాయ్ చేస్తున్నాడు.’పటాస్’ షోలో చేస్తోన్న సమయం నుంచి లేడీ కమెడియన్ ఆసియాతో లవ్ ట్రాకును నడుపుతున్నడ‌ని, ఇప్పటికీ వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ జంట కలిసే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నో యూట్యూబ్ వీడియోలతో కూడా ఈ జంట సంద‌డి చేస్తూ ఉండ‌డం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే తాజాగా వీరిద్ద‌రు క‌లిసి ఓ ప్రైవేట్ సాంగ్ చేశారు. ఇందులో నూక‌రాజుకి ఆసియా రాఖీ క‌డుతుంది. అలానే పాట ఉరితాడు ఉయ్యాల‌యిందా అంటూ సాగుతుండ‌గా, ఈ పాట‌ని చూసిన త‌ర్వాత అంద‌రిలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెల్లెలి పాత్ర‌లో ఆసియా న‌టించ‌డం ఏంటి, నూక‌రాజు ఆమెతో రాఖీ క‌ట్టించుకోవ‌డం ఏంటి అని అంద‌రు క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక‌ప్పుడు నూక‌రాజు ప్రాంక్‌లో భాగంగా చెల్లి అంటే నానా ర‌చ్చ చేసిన ఆసియా ఇప్పుడు అత‌నితో ఎలా రాఖీ క‌ట్టించుకుంది అంటూ అంద‌రు షాక్ అవుతున్నారు. మ‌రి దీనిపై వీరు ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.

ఆ మ‌ధ్య నూక‌రాజు, ఆసియాల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని, ఇద్ద‌రు రిలేష‌న్‌కి బ్రేక‌ప్ చెప్పుకున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే అప్పుడు నూక‌రాజు త‌మ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌ని, తనే నాకు మెసేజ్ చేసింది. అయితే నా మీద కోపం లేదా అని అడిగాను. కోపం లేదు బాధ ఉంది అని చెప్పింది. అబ్బాయిలు ఎవరైనా తప్పు ఎవరిదైనా వెళ్లి మాట్లాడడండి. ఏం కాదు. వాళ్లే వచ్చి మాట్లాడాలి అని ప్రేమను దూరం చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. నేను ఆసియా బాగానే ఉన్నాం అంటూ నూకరాజు అసలు విషయం చెప్పాడు. వారు ఇప్పుడు బాగానే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు.