Tamil Rockers | తమిళ్ రాకర్స్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు..! అడ్మిన్‌ను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు..!
Tamil Rockers | తమిళ్ రాకర్స్ అంటే సినిమా ప్రియులకు పరిచయమే. ఎందుకంటే ఏదైనా కొత్త సినిమా విడుదలైందంటే చాలామంది థియేటర్లకు వెళ్లి చూస్తుంటారు. మరికొందరు పైరసీ వైబ్‌సైట్లను ఆశ్రయిస్తుంటారు. పైరసీ వెబ్‌సైట్లలో ప్రముఖంగా వినిపించే తమిళ్ రాకర్స్‌కు ఫైరసీ ఒకటి. కొత్త సినిమా విడుదలైందంటే చాలు.. థియేటర్‌లో రికార్డు చేసి గంటల్లోనే వెబ్‌సైట్‌లో పెట్టేస్తుంటారు.

Tamil Rockers | తమిళ్ రాకర్స్ అంటే సినిమా ప్రియులకు పరిచయమే. ఎందుకంటే ఏదైనా కొత్త సినిమా విడుదలైందంటే చాలామంది థియేటర్లకు వెళ్లి చూస్తుంటారు. మరికొందరు పైరసీ వైబ్‌సైట్లను ఆశ్రయిస్తుంటారు. పైరసీ వెబ్‌సైట్లలో ప్రముఖంగా వినిపించే తమిళ్ రాకర్స్‌కు ఫైరసీ ఒకటి. కొత్త సినిమా విడుదలైందంటే చాలు.. థియేటర్‌లో రికార్డు చేసి గంటల్లోనే వెబ్‌సైట్‌లో పెట్టేస్తుంటారు. ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాలను ఫైరసీ చేసిన తమిళ్ రాకర్స్‌కు కేరళ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. తమిళ్ రాకర్స్ గ్రూపు అడ్మిన్ స్టీఫెన్ రాజ్‌ను చాకచక్యంగా పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ థియేటర్‌లో ధనుష్ నటించిన ‘రాయన్’ సినిమాను సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తుండగా పోలీసులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు.
మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటించిన ‘గురువాయూర్ అంబలనడైయిల్’ అనే మలయాళ మూవీ విడుదలైన రోజే పైరసీ అయిన విషయం తెలిసిందే. వెబ్‌సైట్‌తో పాటు టెలిగ్రామ్ గ్రూప్‌లో సినిమా చక్కర్లు కొట్టింది. దీంతో నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించారు. మూవీ థియేటర్లలో రికార్డ్ అయ్యిందో తెలుసుకునేందుకు ఎండ్ టూ ఎండ్ డిజిటల్ సినిమా టెక్నాలజీ, సొల్యూషన్ అందించే ‘క్యూబ్ డిజిట్’ను సహాయం కోరారు. వారు అందించిన సమాచారంతో తిరువనంతపురంలోని ఓ మూవీలో సినిమాను పైరసీ చేస్తున్నట్లు తేల్చారు. థియేటర్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎవరూ రికార్డు చేశారనే వివరాలు తెలియలేదు. పైరసీ వీడియో రికార్డ్ అయిన కోణం ఆధారంగా ఏ సీటు నుంచి మూవీని రికార్డు చేశారో పోలీసులు ఖచ్చితంగా గుర్తించారు.
ఆ సినిమా విడుదలైన రోజు ఆ సీట్‌లో కూర్చున్న వ్యక్తి మొబైల్ నంబర్‌ను ట్రే చేశారు. మొబైల్ నెంబర్ తెలిసిన అనంతరం అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించలేదు. సదరు వ్యక్తి ఫోన్ నెంబర్‌తో టికెట్ మళ్లీ బుక్ అయినప్పుడు తమకు సమాచారం అందించాలని థియేటర్ యాజమాన్యానికి సమాచారం అందించారు. ఈ క్రమంలోనే రాయన్ మూవీ కోసం సదరు వ్యక్తిని మళ్లీ టికెట్ బుక్ చేశాడు. దీంతో థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి థియేటర్‌కు వచ్చి రికార్డు చేస్తున్న సమయంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. చాలాకాలంగా సినిమాలు రికార్డు చేస్తున్నట్లు అతడు అంగీకరించాడని కేరళ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కొచ్చి సైబర్ క్రైం పోలీసులు వివరాలు వెల్లడించారు. స్టీఫెన్ రాజ్‌ను ఐదురోజుల కస్టడీకి తీసుకున్నామని చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుడి స్వస్థలం తమిళనాడులోని మధురైకి చెందినవాడిగా గుర్తించినట్లు వివరించారు.