Ghantasala | ‘గున్నమామిడి కొమ్మమీద’ సాంగ్‌లో నటించింది ఘంటసాల అల్లుడేనా..?

గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఆలపించిన గీతాలు ఇప్పటికీ యావత్‌ సినీ సంగీత అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ గాన గంధర్వుడి కుటుంబం గురించి తెలిసింది తక్కువే.

Ghantasala | ‘గున్నమామిడి కొమ్మమీద’ సాంగ్‌లో నటించింది ఘంటసాల అల్లుడేనా..?

Ghantasala | గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఆలపించిన గీతాలు ఇప్పటికీ యావత్‌ సినీ సంగీత అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. గాయకునిగానే కాదు.. సంగీత దర్శకునిగానూ తనదైన బాణీలు పలికించారు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో బ్లాక్‌ బ్లస్టర్‌గా నిలిచిన అనేక చిత్రాలు ఆయన స్వరకల్పన, గళవిన్యాసంతోనూ రూపొందాయి. నేటికీ ఆయన పంచిన గాన మధురాలు నవతరం సైతం ఎంజాయ్‌ చేస్తున్నది. ఈ గాన గంధర్వుడి ఫ్యామిలీ గురించి చాలా తక్కువే. దాంతో ఆయన కుటుంబం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఘంటసాల కాలం చేసే సమయానికి ఆయనకు శాంతి అనే కూతురు ఉన్నది. ఆ సమయంలో ఆమెకు 11 సంవత్సరాలు. ఆమెకు సురేంద్ర అనే వ్యక్తితో వివాహం జరిగింది. చెన్నైలో ఆయన పెద్ద వ్యాపారవేత్త. తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

సురేంద్ర పాపులర్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌. ఎన్‌టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణ సినిమాల్లోనూ నటించారు. ‘బాలమిత్ర కథ’ సినిమాలో ‘గున్నమామిడి కొమ్మమీద’ సాంగ్‌ను ఆయనపైనే చిత్రీకరించారు. ఆ పాటలో ముద్దుగా బొద్దుగా అమాయకంగా కనిపించే ఆ కుర్రాడే ఈ సురేంద్ర. ఘంటసాల చనిపోయే సమయానికి ఆయన వయసు 13 సంవత్సరాలు. తనకు మొదటి నుంచి సినిమాల్లో నటించడం ఇష్టం ఉండేది కాదని.. తన తల్లి కోసం నటించానని తెలిపారు. తాను హీరో కావాలని అమ్మ అనుకునేదని.. కానీ ఆ వైపు ఎక్కువగా ఇష్టం ఉండేది కాదన్నారు. అంతకుముందు ఘంటసాల గారి కుటుంబంతో మాకు చుట్టరికం లేదని.. ఆ తర్వాత కాలంలో ఘంటసాల గారి అమ్మాయి .. నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఘంటసాల వెంకటేశ్వర్‌రావుకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యపేరు సావిత్రమ్మ, రెండోభార్య సరళాదేవి. ఆయనకు విజయ్‌కుమార్‌, రత్నకుమార్‌, శంకర్‌ కుమార్‌, రవికుమార్‌ కొడుకులు ఉన్నారు. అలాగే, శ్యామల, సుగుణ, మీనా అనే కూతుళ్లు సైతం ఉన్నారు.